PHOTOS

Anupama Parameswaran: ఎంత చేసినా స్టార్ హీరోయిన్ రేంజ్ కు దూరంగా ఉండిపోయిన అనుపమ పరమేశ్వరన్..

మేశ్వరన్  టాలీవుడ్ ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అ..ఆ’ మూవీతో సిల్వర్ స్క్...

Advertisement
1/6
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్

అనుపమ పరమేశ్వరన్.. ఈ ఇయర్ ‘టిల్లు స్క్వేర్’ మూవీతో మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో అనుపమ లిల్లి జోసెఫ్ పాత్రలో తన మార్క్ నటనతో అదరగొట్టేసింది.

2/6
రంగస్థలం
రంగస్థలం

మలయాళీ భామ అయిన అనుపమకు ప్రారంభంలో తెలుగులో ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీతో ముందుగా ఈమనే అనుకున్నారు. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో సమంతను తీసుకున్నారు. ఒకవేళ ఈ పాత్ర అనుపమకు దక్కి ఉంటే ఆమె రేంజే వేరే లెవల్లో ఉండేది.

3/6
‘కార్తికేయ 2
‘కార్తికేయ 2

ప్రస్తుతం అనుపమ  స్టార్ హీరోల సరసన కాకుండా మిడ్ రేంజ్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. నిఖిల్ సిద్దార్ధ్ తో చేసిన ‘కార్తికేయ 2’ తో ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయింది.

4/6
మలయాళ ‘ప్రేమమ్’
మలయాళ  ‘ప్రేమమ్’

అనుపమ పరమేశ్వర్ కేరళ రాష్ట్రంలోని ఇరంజకుడాలో 1996 ఫిబ్రవరి 18న జన్మించింది. అంతేకాదు మలయాళ క్లాసిక్ హిట్ ‘ప్రేమమ్’ మూవీతో తెరంగేట్రం చేసింది. అందులో మేరీ జార్జ్ పాత్రలో హీరో ఫస్ట్ లవర్ పాత్రలో అదరగొట్టింది.

5/6
నాగ చైతన్య - ప్రేమమ్
నాగ చైతన్య - ప్రేమమ్

అదే సినిమా తెలుగులో అదే ప్రేమమ్ టైటిల్ తో నాగ చైతన్య హీరోగా తెరకెక్కింది. ఈ సినిమాలో సుమగా చైతూ ఫస్ట్ క్రష్ గా యాక్ట్ చేసి మెప్పించింది.

 

6/6
టిల్లు స్క్వేర్
టిల్లు స్క్వేర్

తాజాగా ఈ యేడాది ‘టిల్లు స్క్వేర్ మూవీతో హిట్ అందుకున్నా.. అనుపమకు పెద్దగా పేరొచ్చింది లేదు. ప్రస్తుతం అనుపమ చేతిలో వివిధ భాషల్లో అర డజనుకు పైగా చిత్రాలున్నాయి.

 





Read More