PHOTOS

Antarvedi new ratham ( chariot ) : అద్భుతంగా తయారైన అంతర్వేది కొత్త రథం..

రథం సిద్ధమైంది. కోటి పది లక్షల ఖర్చుతో..ఏడు అంతస్థులతో శరవేగంగా నిర్మితమైన అంతర్వేది రథం అందర్నీ ఆకర్షిస్తోంది. రథ సప్తమి నాడు ప్రారంభ...

Advertisement
1/4
Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం సిద్ధం
Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం  సిద్ధం

అంతర్వేది రధం దగ్దమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు వేయడమే కాకుండా...తక్షణం 90 లక్షలు మంజూరు చేసి కొత్త రధం నిర్మిస్తామని స్పష్టం చేసింది. డిసెంబర్ 30 నాటికి కొత్త రధ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పినా..శరవేగంగా ఏడంతస్థుల నూతన రధాన్ని కోటి పది లక్షల రూపాయలతో నిర్మించారు.

2/4
Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం సిద్ధం
Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం  సిద్ధం

భక్తుల మనోభావాల్ని పరిరక్షించేందుకు అగ్నికి ఆహుతైన రధం స్థానంలో కొత్త రధాన్ని నిర్మించామని...స్వామి వారి కళ్యాణానికి సిద్ధం చేస్తామని మంత్రి వేణు గోపాల కృష్ణ చెప్పారు. భీష్మ ఏకాదశి పర్వదినానికి అన్ని హంగులతో కొత్త రధాన్ని సిద్ధం చేసి..రధ సప్తమి నాడు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. 

3/4
Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం సిద్ధం
Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం  సిద్ధం

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరశింహ స్వామి ఆలయ ప్రాంగణంలోని రధం సెప్టెంబర్ 5 వ తేదీన దగ్దమైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. హిందూవుల మనోభావాల్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు వేయడమే కాకుండా...తక్షణం 90 లక్షలు మంజూరు చేసి కొత్త రధం నిర్మిస్తామని స్పష్టం చేసింది. డిసెంబర్ 30 నాటికి కొత్త రధ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పినా..శరవేగంగా ఏడంతస్థుల నూతన రధాన్ని కోటి పది లక్షల రూపాయలతో నిర్మించారు. అనుకున్న సమయం కంటే ముందే నిర్మాణం పూర్తి చేశామని..రధాన్ని పరిశీలించిన మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు.

4/4
Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం సిద్ధం
Antarvedi new chariot: అంతర్వేది స్వామి సన్నిధిలో కొత్త రధం  సిద్ధం

Antarvedi new chariot: అంతర్వేది ఆలయ కొత్త రధం సిద్ధమైంది. అనుకున్న సమయం కంటే ముందే అత్యంత సుందరంగా రధం నిర్మితమైంది. రధ సప్తమి నాడు ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తుది హంగులు దిద్దుకుంటున్న రధాన్ని మంత్రి, అధికారులు  పరిశీలించారు.

Read More