Home> ఎన్ఆర్ఐ
Advertisement

US: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి

US news: ఉన్నత చదువులు కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా.. మరొకరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది. 
 

US: అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి

Two Indian Students Found Dead In US: తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత చదువులు కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు యువకులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా.. మరొకరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది. 

వివరాల్లోకి వెళితే..
వనపర్తి రాంనగర్‌కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల ఏకైక కుమారుడు దినేశ్‌(23) బీటెక్‌ చదివారు. ఎంఎస్‌ చదివేందుకు అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రంలోని హార్ట్‌ఫోర్డ్‌కు గత నెల 28న వెళ్లాడు. యూఎస్ కు వెళ్లిన 17 రోజులకే అతడు హఠాన్మరణం చెందడంతో దినేశ్ కుటుంబంలో విషాదం అలముకుంది. ఎదిగిన కొడుకు మృతి చెందడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు  నిద్రలోనే చనిపోయినట్లు సమాచారం అందిందని బాధిత తల్లిదండ్రులు వెల్లడించారు. అంతేకాకుండా వారు తమ కుమారుడి మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దినేష్ తండ్రి వెంకన్న ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉన్నారు. 

దినేష్ తోపాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థి కూడా మృతి చెందాడు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషవాయువు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని అక్కడి నుంచి సమాచారం వచ్చినట్లు తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ఓదార్చారు. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని అమెరికా నుంచి వనపర్తికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వెళ్లి కలిశారు. 

Also Read: New Bat Virus: ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త వైరస్, గబ్బిలాల్లో గుర్తింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More