Home> ఎన్ఆర్ఐ
Advertisement

Indian Origin Girl Death Case: చిన్నారి తలలో దూసుకెళ్లిన బుల్లెట్.. నిందితుడికి 100 ఏళ్లు జైలు శిక్ష

Man Sentenced To 100 Years In Prison: ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంలో చిన్నారి అన్యాయంగా ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు ఎదుటి వ్యక్తిపై తుపాకీ పేల్చగా.. బుల్లెట్ అతనికి మిస్ ఓ చిన్నారి తలలో దూసుకెళ్లింది. దీంతో న్యాయస్థానం నిందితుడికి వందేళ్ల జైలు శిక్ష విధించింది.  
 

Indian Origin Girl Death Case: చిన్నారి తలలో దూసుకెళ్లిన బుల్లెట్.. నిందితుడికి 100 ఏళ్లు జైలు శిక్ష

Man Sentenced To 100 Years In Prison: అమెరికాలో భారత సంతతికి చెందిన ఐదేళ్ల బాలిక మృతి చెందిన కేసులో ఓ యువకుడికి 100 ఏళ్ల జైలు శిక్ష పడింది. 35 ఏళ్ల జోసెఫ్ లీ స్మిత్‌కు 100 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. 2021లో మియా పటేల్ అనే బాలికను లూసియానా రాష్ట్రంలో కాల్చి చంపారు. మియా పటేల్‌ మాంక్‌హౌస్‌ డ్రైవ్‌లోని ఓ హోటల్‌ గదిలో ఆడుకుంటుండగా.. బుల్లెట్‌ చిన్నారి తలలోంచి దూసుకెళ్లింది. బాలికను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజులు ఆసుపత్రిలో ఉన్న తర్వాత మరణించింది. ఈ కేసులో తాజాగా నిందితుడికి న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాలు ఇలా..

భారత్‌కు చెందిన విమల్, స్నేహల్ పటేల్‌ దంపతులు. వీరు లూసియానాలో ఓ హోటల్ నడుపుతున్నారు. వీరి కూతురు మియా, కుమారుడు హోటల్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో హోటల్ బయట స్మిత్ అనే వ్యక్తి.. మరో వ్యక్తికి వాగ్వాదం జరిగింది. కోపంలో స్మిత్ తుపాకీతో అతడిని కాల్చాడు. ఇది అతడికి మిస్ అయి చిన్నారి మియా తలకు తగిలింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. మూడు రోజుల తర్వాత ఆమె మృతి చెందింది.

ఈ ఘటనలో విచారణ చేపట్టిన కోర్టు.. రెండేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. జిల్లా జడ్జి జాన్ డి మోస్లీ స్మిత్‌కు 60 ఏళ్ల జైలు శిక్ష విధించారు. విచారణను అడ్డుకున్నందుకు అదనంగా మరో 20 ఏళ్లు.. వరుసగా నేరాలకు పాల్పడుతున్నందుకు మరో 20 ఏళ్లు.. మొత్తం 40 ఏళ్లు అదనంగా శిక్ష అనుభవించాలని ఆదేశించారు. మొత్తం 100 ఏళ్లు జైలు శిక్ష విధించారు. శిక్షలో తగ్గింపు లేకుండా తక్షణమే శిక్షను అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. స్మిత్ పునరావృత నేరస్థుడిగా కావడంతో మొత్తం 100 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కాడో పారిష్ జిల్లా అటార్నీ కార్యాలయం వెల్లడించింది.

Also Read: Pension Plan: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి.. ప్రతి నెలా పెన్షన్ పొందండి  

Also Read: IPL 2023 Updates: టైటిల్ వేటకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ.. ఆశలన్నీ వారిపైనే..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More