Home> ఎన్ఆర్ఐ
Advertisement

China Corona: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు... క్వారెంటైన్‌ కేంద్రాల్లో ప్రజలు ఇబ్బందులు

China Corona: చైనాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. షాంఘైలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. 
 

China Corona: చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు... క్వారెంటైన్‌ కేంద్రాల్లో ప్రజలు ఇబ్బందులు

China Corona: చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులగా డ్రాగన్ కంట్రీలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ నగరమైన షాంఘైలో వైరస్ (Covid Cases in shanghai) విజృంభణ కొనసాగుతోంది. అక్కడ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు చోటుచేసుకుంటున్నాయి. షాంఘైలో ఆదివారం ఒక్కరోజే మూడు కొవిడ్ మరణాలు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.  ఈ ఏడాది మార్చిలో షాంఘైలో వైరస్ ఉద్ధృతి మెుదలైంది. చైనా వ్యాప్తంగా బయటపడుతున్న కేసుల్లో 95 శాతం షాంఘైలో నమోదవుతున్నాయి. 

మరోవైపు కఠిన క్వారెంటైన్‌ నిబంధనలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. మార్చి 28 నుంచి దశలవారీగా నగరంలో ఆంక్షలు విధించారు. షాంఘైలో 2కోట్లకుపైగా ప్రజలు లాక్‌డౌన్‌లో (shanghai lockdown) ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఆ వ్యక్తి పక్కాగా వారం రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాల్సిందే. నగరంలో 100కు పైగా క్వారంటైన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్ లో దాదాపు 50వేల వరకు పడకలను ఏర్పాటు చేశారు. 

అయితే క్వారంటైన్ కేంద్రాల్లో సరైన వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటలుపాటు లైట్లు వేసి ఉంచటంతో... నిద్ర పట్టడం లేదని బాధితులు వాపోతున్నారు. పైకప్పు సరిగా లేక వర్షం నీరు లోపలికి వస్తుంది. బాత్రూమ్ లు శుభ్రంగా ఉండట్లేదని రోగులు ఆరోపిస్తున్నారు.  కనీసం స్నానానికి వేడి నీళ్లు కూడా దొరకని పరిస్థితి అక్కడి నెలకొంది. 

Also Read: Mysterious Liver Illness: ప్రపంచాన్ని భయపెడుతున్న మరో అంతుచిక్కని వ్యాధి.. అమెరికా, యూకెల్లో బయటపడిన కేసులు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Read More