Home> ఎన్ఆర్ఐ
Advertisement

Canada New Work Hour Rules: వారానికి 20 గంటల పని నిబంధన తొలగింపు, భారతీయ విద్యార్ధులకు ఎలా ప్రయోజనకరం

Canada New Work Hour Rules: కెనడాలోని అంతర్జాతీయ విద్యార్ధులకు ఉపశమనం కలిగింది. కెనడా ప్రభుత్వం వారానికి 20 గంటల నిబంధనను ఉపసంహరించింది. ఫలితంగా విద్యార్ధులకు రిలీఫ్ లభించనుంది.

Canada New Work Hour Rules: వారానికి 20 గంటల పని నిబంధన తొలగింపు, భారతీయ విద్యార్ధులకు ఎలా ప్రయోజనకరం

కెనడా ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు రిలీఫ్ కల్గించే నిర్ణయం తీసుకుంది. లేబర్ కొరతను ఎదుర్కొనే క్రమంలో వారానికి 20 గంటల నిబంధనను తొలగించింది. ఈ నిర్ణయం ప్రభావం భారతీయ విద్యార్ధులపై ఎలా పడనుందో తెలుసుకుందాం..

వారానికి 20 గంటల నిబంధనను నవంబర్ 15, 2022 నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ పాక్షికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. లేబర్ కొరతను ఎదుర్కొనే క్రమంలో కెనడా ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చింది. ఏప్రిల్‌లో 6 శాతం ఉన్న ఉద్యోగ ఖాళీల రేట్ ఇప్పుడు 5.4 శాతానికి పడిపోయింది. 

ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్, పౌరసత్వ వ్యవహారాల మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. కెనడాలో సిబ్బంది కంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. విద్యార్ధులు తమ విద్యారంగంలో మరిన్ని ఉద్యోగాలు సాధించగలరన్నారు. కెనడాలో జాబ్ ఓపెనింగ్స్ పెరుగుతున్నందున కెనడా ప్రభుత్వం శాశ్వత ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు చేస్తోందని తెలుస్తోంది. 

పని గంటల్లో రిలాక్సేషన్‌తో భారతీయ విద్యార్ధులకు ప్రయోజనం

కొత్త మార్గదర్శకాలు రూపొందేవరుకూ కెనడా విద్యాసంస్థల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్ధులు వారానికి 20 గంటల కంటే తక్కువ ఆఫ్ క్యాంపస్ పని కొనసాగించవచ్చు. అయితే సమ్మర్, వింటర్ సెలవుల్లో మాత్రం పనిగంటలు 20 దాటవచ్చు. 

కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండటంతో భారతీయ విద్యార్ధులు, అంతర్జాతీయ విద్యార్ధులు ఆర్ధికంగా మెరుగుపడేందుకు అవకాశముంటుంది.

అంతర్జాతీయ విద్యార్ధుల్లో మూడవ వంతున్న భారతీయ విద్యార్ధులు కెనడా ప్రభుత్వ నిర్ణయం కారణంగా ప్రయోజనం పొందనున్నారు. 

ఎక్కువ పని గంటలుండటంతో భారతీయ విద్యార్ధులు ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు అవకాశం కలగనుంది. పడిపోతున్న ఇండియన్ రూపీని ఎదుర్కొనేందుకు ఈ విధానం దోహదపడుతుంది. 

కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం కారణంగా విదేశీ విద్యార్ధులకు కెనడాలో అవసరమైన ఉద్యోగ అనుభవం లభిస్తుంది. ఫలితంగా కెనడా పోస్ట్ పాండెమిక్ అభివృద్ధికి ఊతమిస్తుంది. 

పనిగంటల పరిమితి నిబంధన తొలగించడం ద్వారా విద్యార్ధులకు కెనడాలో మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి తెలిపారు. 

Also read: California Kidnap: కాలిఫోర్నియాలో కలకలం, 8 ఏళ్ల చిన్నారి సహా భారత సంతతి కుటుంబం కిడ్నాప్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More