Home> No Rev
Advertisement

Bhargavi Nilayam: ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న టోవినో థామస్ హార్రర్ థ్రిల్లర్ ‘భార్గవి నిలయం’..

Bhargavi Nilayam OTT Streaming : మలయాళ సినీ ఇండస్ట్రీ అంటేనే వెరైటీ చిత్రాలకు పెట్టింది పేరు. ఇమేజ్ కోసం పాకులాడకుండా కథకు అనుగుణంగా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు. తాజాగా మలయాళ హీరో టోవినో థామస్ హీరోగా తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ చిత్రం ‘భార్గవి నిలయం’ ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Bhargavi Nilayam: ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న టోవినో థామస్ హార్రర్ థ్రిల్లర్ ‘భార్గవి నిలయం’..

Bhargavi Nilayam: మలయాళంలో వెరైటీ సబ్జెక్ట్స్ తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు టోవినో థామస్. ఈయన లీడ్ రోల్ల్ యాక్ట్ చేసిన సినిమా ‘భార్గవి నిలయం’. మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ఆహాలో ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బ‌షీర్ (టోవినో థామ‌స్‌) ఓ రైట‌ర్‌. స్టోరీ రాయ‌డానికి స‌ముద్రం ఒడ్డున ఉన్న ఓ ఊరికి వ‌స్తాడు. ఊరి చివ‌ర ఉన్న భార్గవి నిల‌యం అనే పురాత‌న భ‌వంతి రెంట్ కు దిగుతాడు.

ఆ ఇంట్లో భార్గవి (రీమా క‌ల్లింగ‌ల్‌) అనే అమ్మాయి ఆత్మ ఉంద‌ని అంద‌రూ చెబుతూ ఉంటారు. కొంద‌రు ఆ ఆత్మను నిజంగానే చూస్తారు. ఇంట్లో ఎవ‌రూ అడుగుపెట్టినా స‌హించ‌ని భార్గవి ఆత్మ బ‌షీర్‌ను మాత్రం ఏం చేయ‌దు. అసలు భార్గవి బషీర్ ను ఎందుకు ఏమి అనదు.
ఈ సందర్భంగా భార్గవి గురించి అందరు రకరకాల కథలు చెబుతూ ఉంటారు.

ఈ కోవలో భార్గవి చావు వెనక ఉన్న అసలు నిజం ఏమిటో తెలుసుకునే దిశగా కథ రాయాలని బషీర్ డిసైడ్ అయితాడు. ఈ క్రమంలో బషీర్ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి.  భార్గవి ఎలా చనిపోయింది. భార్గవి లవ్ చేసిన శివకుమార్ (రోషన్ మాథ్యూ) ఎందుకు అదృశ్యం అయ్యాడు. దానికి వెనక ఉన్న కారణాలు ఏమిటి.. ?  భార్గ‌వి మేన‌మామ నారాయ‌ణ‌న్ (టామ్ చాకో)...బ‌షీర్‌ను చంప‌డానికి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? అన్న‌దే “భార్గవి నిలయం” స్టోరీ. హర్రర్ సినిమాలో లవ్ అండ్ ఎమోన్ అన్ని ఫీల్ లో ఈ సినిమాను తెరెక్కించాడు. ఇపుడీ ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More