Home> No Rev
Advertisement

బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా అష్టదిగ్బంధనం ట్రైలర్ రిలీజ్

ఇటీవల కాలంలో చిన్న సినిమాలకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. మంచి కథనం ఉన్న సినిమాని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. 'అహం' అనే దానిపై తెరకెక్కిన సినిమా "అష్టదిగ్బంధనం". సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా.. ఈ నెల 22 న విడుదల కానుంది. 
 

బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా అష్టదిగ్బంధనం ట్రైలర్ రిలీజ్

Ashtadigbandhanam Trailer: సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా "అష్టదిగ్బంధనం". ఈ సినిమాకి బాబా పి.ఆర్ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఎ గేమ్ విత్ క్రైమ్ "అనేది ట్యాగ్ లైన్".  ఇదివరకే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేయగా..  ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ ను బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ లాంచ్ చేశారు. డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. టైటిల్ చాలా బాగుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ..  చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికి వస్తే.. ఇక ట్రైలర్ పరిశీలిస్తే యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది..  ఈ యుద్ధం రాజ్యం కోసమో.. రాణి కోసమో..  అధికారం కోసమో కాదు అహం కోసం..  అంటూ సాగిన నెరేషన్ డైలాగ్ ఆసక్తిని రేకెత్తించింది. "అహంతో మొదలైన యుద్ధం.. ఆ అహం దేహాన్ని వీడినప్పుడే ముగుస్తుంది" అంటూ ట్రైలర్ కట్ చేశారు. ట్రైలర్ మొత్తం హింసాత్మక సీన్లతో ఉండగా.. అక్కడక్కడా కొన్ని రొమాంటిక్ షాట్స్ కూడా కనిపించాయి. "మనిషిలో ఉన్న అహంతో మొదలైన యుద్ధం.. ఆ అహం దేహాన్ని వీడినప్పుడే ఆ యుద్ధం ముగుస్తుంది" అనే లైన్ మీదే సాగుతున్నట్టు క్లారిటీ ఇచ్చేసింది చిత్ర యూనిట్.

ఇక ట్రైలర్ వచ్చిన బీజీఎమ్ మళయాలం బ్లాక్ బస్టర్ "ట్రాన్స్" సినిమాకి సంగీతం అందించిన "జాక్సన్ విజయన్" బీజీఎమ్ హైలైట్ గా నిలిచింది. "అష్టదిగ్బంధనం" సినిమాలో సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో మహమ్మద్ రజాక్, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Jio vs Airtel Fiber Plans: జియో, ఎయిర్‌టెల్ ఫైబర్ ప్రీ పెయిడ్ ప్రాన్స్ ధర, ఓటీటీలు

నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.
రచన - దర్శకత్వం: బాబా పి.ఆర్
నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్ 
మ్యూజిక్: జాక్సన్ విజయన్ కెమెరా: బాబు కొల్లబత్తుల 
ఎడిటింగ్: నాగేశ్వర్ రెడ్డి బొంతల 
ఫైట్స్: రామ్ క్రిషన్, శంకర్ ఉయ్యాల 
లిరిక్స్: శ్యామ్ కాసర్ల, పూర్ణ చారి 
ఆర్ట్: వెంకట్ ఆరే 
పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి 
ప్రొడక్షన్ మేనేజర్: కుర్మ భీమేష్ 
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన సావ్దేరక్ 
మేకప్: జి.శివ
కాస్ట్యూమర్: ప్రవీణ్ 
స్టిల్స్: శ్రీకాంత్.

Also Read: Poco M6 Pro 5G Price: అదనపు తగ్గింపులతో ఆకర్శిస్తున్న ఫ్లిప్‌కార్ట్‌..POCO M6 Pro 5Gపై రూ.12,050 వరకు తగ్గింపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More