Home> లైఫ్ స్టైల్
Advertisement

Sabja Seeds: సబ్జా గింజలతో కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా?

sabja seeds benefits: సబ్జా గింజలు తీసుకోవడం వల్ల అనారోగ్యసమస్యల నుంచి బయటపడడానికి ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీనిని ఎక్కువగా షర్బత్, జ్యూస్ వంటి వాటిలో క‌లిపి తీసుకుంటూ ఉంటారు. స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్రయోజ‌నాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Sabja Seeds: సబ్జా గింజలతో కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా?

Sabja Seeds Benefits: సబ్జా గింజలను చియా గింజలు అని కూడా పిలుస్తు ఉంటారు. దీనిని ఎక్కువగా మనం జ్యూస్‌ తయారిలో, వేసవి కాలంలో ఎక్కువగా తీసుకుంటాం. అయితే ఈ గింజలు మార్కెట్‌లో కూడా దొరుకుతాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చియా, సబ్జా గింజల్లో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. స‌బ్జా గింజ‌ల‌ను నీటిలో వేసి నాన‌బెట్ట‌డం వ‌ల్ల  క‌లిగే ఆరోగ్య ప్రయోజ‌నాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సబ్జా గింజలు జ్యూస్‌ రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యస్థ మెరుగుపడుతుంది. 

నిపుణుల ప్రకారం సబ్జా గింజల్లో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా లభిస్తుంది. దీని వల్ల మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ప్రేగుల కదలికలను పెంచడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలను దూరం చేయడంలోనూ సహాయపడుతుంది.

అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి ఈ సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి.

షుగర్‌ లెవల్స్‌ను అదుపు చేయడంలో ఈ గింజలు సహాయపడుతాయి.

Also read: Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే నూనెలు ఇవే..మీరు ట్రై చేయండి..

స‌బ్జా గింజ‌ల్లో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు కూడా అధికంగా ఉంటాయి.

కీళ్ల‌నొప్పులు, వాపులు, ఆర్థ‌రైటిస్ సమస్యల బారిన బాధపడుతున్నవారు ఈ సబ్జా గింజలతో ఉపశమనం పొందవచ్చు.

జ‌లుబు, ఫ్లూ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌పడే వారు స‌బ్జా గింజ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఈ విధంగా స‌బ్జా గింజ‌లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని  ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
 

Also read: Palak Soup: అధిక బరువు సమస్యకు పాలక్‌ సూప్‌తో చెక్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More