Home> లైఫ్ స్టైల్
Advertisement

White Hair: రూపాయి ఖర్చు లేకుండా తెల్ల జుట్టు సమస్యలకు ఇలా చెక్‌ పెట్టొచ్చు!

White Hair Problems: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. 

White Hair: రూపాయి ఖర్చు లేకుండా తెల్ల జుట్టు సమస్యలకు ఇలా చెక్‌ పెట్టొచ్చు!

 

White Hair Problems: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఇలాంటి సమస్యలున్నవారు ఎక్కువగా ఆందోళన చెందుతారు. దీంతో పాటు మానసిక సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఈ సమయంలో బాధపడేవారు మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా వారు మరిన్ని జుట్టు సమస్యల బారన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోం రెమెడీస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. వీటి వినియోగించడం వల్ల సులభంగా తెల్ల జుట్టు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చుకోవచ్చు:
కుంకుడు కాయ:

కుంకుడు కాయ జుట్టుకు అద్భుతమైన ఔషధం..ఇందులో జుట్టుకు కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇది జుట్టు మూలాల నుంచి బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా జుట్టు సంబంధిత సమస్యలను కూడా తొలగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టు నెరసిపోకుండా కూడా సహాయపడుతుంది. దీంతో పాటు జుట్టు పొడవుగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

ఉసిరి కాయ:
ఉసిరికాయ జుట్టుతో పాటు శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఒక ఉసిరికాయను తీసుకుంటే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ఉసిరికాయ మిశ్రమంలా తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేసుకుంటే జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని ఆపివేస్తుంది.

 జుట్టుకు పచ్చి ఉసిరినే కాకుండా పొడిని కూడా వినియోగించవచ్చు. దీని కోసం ఉసిరి పొడిలో కొబ్బరి నూనె మిక్స్ చేసి..మీ జుట్టుకు అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత 20 నుంచి 25 నిముషాలు అలాగే ఉంచి నీటితో శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడితే జుట్టు పొడవుగా..దృఢంగా, నల్లగా మారుతుంది.

Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

మస్టర్డ్ ఆయిల్:
ఆయుర్వేదం ప్రకారం..తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ఆవనూనె కూడా వినియోగించవచ్చు. ఇందులో జుట్టు సమస్యలను తొలగించే చాలా రకాల పోషకాలు లభిస్తాయి. తెల్ల జుట్టు సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా మస్టర్డ్ ఆయిల్‌ను జుట్టుకు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జుట్టు రాలకుండా కూడా ఉంటుంది.

Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More