Home> లైఫ్ స్టైల్
Advertisement

White Hair Problem: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..!

White Hair Problem: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా  25 నుంచి 30 ఏళ్లలో జుట్టు నెరిసిపోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి.

 White Hair Problem: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇవి పాటించండి..!

White Hair Problem: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో జుట్టు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా  25 నుంచి 30 ఏళ్లలో జుట్టు నెరిసిపోవడం వంటి ఇబ్బందులు వస్తున్నాయి. మార్కెట్‌లో లభించే ఉత్పత్తులను వినియోగించిన.. అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఆహార నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ హోం రెమెడీస్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం...

వీటి సహాయంతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..!

1. ఉల్లిపాయ:

ఉల్లిపాయ ఆహారం రుచిని పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీనితో జుట్టుకూడా చాలా రకాల ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి ప్రతిరోజూ తలస్నానానికి 30 నిమిషాల ముందు ఉల్లిపాయ పేస్ట్‌ను జుట్టుకు పట్టించండి. జుట్టు సమస్యలు తొలగిపోతాయి.

2. ఆవు పాలు:

ఆవు పాల వల్ల కలిగే సహజ ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు.. అయితే వీటి వల్ల జుట్టు సమస్యలు కూడా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకుండా తెల్ల జుట్టును నల్లగా చేసేందుకు ప్రభావవంతంగా పని చేస్తాయి.

3. బ్లాక్ పెప్పర్:

వంటకాల రుచిని పెంచడానికి బ్లాక్ పెప్పర్ పొడిని ఉపయోగిస్తార. కానీ ఇందులో ఉండే గుణాలు జుట్టును నల్లగ చేసేందుకు సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇందుకోసం పెప్పర్‌ను నీళ్లలో వేసి మరిగించి.. చల్లారిన తర్వాత తలకు పట్టించాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లో తెల్లజుట్టు మళ్లీ నల్లగా మారుతుంది.

4. అలోవెరా జెల్:

ముఖం, చర్మ సౌందర్యాన్ని పెంచడానికి అందరూ తరచుగా అలోవెరా జెల్‌ను ఉపయోగిస్తారు. కానీ ఇందులో ఉండే గుణాలు జుట్టుకు కూడా చాలా మేలు చేస్తాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. దీనిలో నిమ్మరసం కలిపి పేస్ట్‌ను తయారు చేసి.. జుట్టుకు అప్లై చేసి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే.. తెల్ల జుట్టు నల్లగా మారే అవకాశాలున్నాయి. 

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More