Home> లైఫ్ స్టైల్
Advertisement

Weight Loss Tips: మధుమేహ వ్యాధిగ్రస్థులు వేగంగా బరువు తగ్గించుకునే 4 పద్ధతులు

Weight Loss Tips: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. రోజురోజుకూ మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. స్థూలకాయం ప్రధాన కారణంగా ఉంది. బరువు తగ్గించడమే డయాబెటిస్ రోగులముందున్న ప్రధమ కర్తవ్యం.

Weight Loss Tips: మధుమేహ వ్యాధిగ్రస్థులు వేగంగా బరువు తగ్గించుకునే 4 పద్ధతులు

Weight Loss Tips: ఇండియాలో డయాబెటిస్ వ్యాధి చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే 7. 7 కోట్ల మధుమేహ వ్యాధిగ్రస్థులతో ఇండియా డయాబెటిస్ రాజధానిగా మారిందంటే అతిశయోక్తి లేదు. మధుమేహం నియంత్రించాలంటే ముందు చేయాల్సింది ఆహారపు అలవాట్లు మార్చుకోవడం, బరువు తగ్గించుకోవడం. 

కడుపు దగ్గర స్థూలకాయం ఉండటం అంటే ఊబకాయం అనేది డయాబెటిస్ ముప్పుకు ప్రధాన సంకేతం. అటు డయాబెటిస్ ఇటు స్థూలకాయం రెండూ ఉంటే గుండె వ్యాధులు, హార్ట్ ఎటాక్, నరాలు, కిడ్నీలు దెబ్బతినడం వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. బరువు పెరగడం, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి కారణం జెనెటిక్ అంశాలతో పాటు ఆధునిక జీవనశైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు కూడా ఉంటుంటాయి. ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అధిక కేలరీలు ఆహారం తీసుకోవడం మధుమేహానికి కారణమౌతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులు ముందుగా బరువు తగ్గించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వ్యాయామం

మధుమేహం వ్యాధిగ్రస్థులు ముందుగా అలవర్చుకోవల్సింది ఫిజికల్ యాక్టివిటీ. అంటే రోజూ తగిన సమయం కేటాయించి వ్యాయమం చేస్తుండాలి. దీనివల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ తగిన విధంగా పనిచేస్తుంది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాల్సి ఉంటుంది.

రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం

రిఫైండ్ పంచదార, స్వీట్స్, అరటి పండ్లు, జ్యూస్ వంటి కార్బోహైడ్రేట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అమాంతం పెంచేస్తాయి. మరోవైపు వైట్ రైస్, బ్రెడ్, పిజ్జా, పేస్ట్రీ, పాస్తా వంటి ప్రోసెస్డ్ ఫుడ్స్ పూర్తిగా దూరం చేయాలి లేదా కనీసం తగ్గించాలి. 

బయటి తిండికి చెక్

మధుమేహం వ్యాధిగ్రస్థులు సాధ్యమైనంతవరకూ బయటి తిండికి దూరంగా ఉండాలి. బయటి తిండి తగ్గించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఫలితంగా గుండె వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

హై ఫైబర్ ఫుడ్

మధుమేహం పీడితులు తృణ ధాన్యాలు, పప్పులు, నట్స్ అండ్ ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు, ఫ్లక్స్ సీడ్స్, మెంతులు వంటి ఫైబర్ అధికంగా ఉండే పదార్ధాలను రోజువారీ డైట్‌లో భాగం చేయాలి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం ఆరోగ్యానికి సదా మంచిది. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా త్వరగా ఆకలేయకుండా ఉంటుంది. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది.

Also read: Anti Ageing Tips: ఆ ఫేస్‌ప్యాక్ రాస్తే 2 నెలల్లో ముఖంపై ముడతలు మాయం, నిత్య యౌవనం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More