Home> లైఫ్ స్టైల్
Advertisement

Weight Loss Tips: స్థూలకాయం పోవాలంటే..డిన్నర్ ఎప్పుడు తీసుకోవాలి, కొవ్వు ఎలా కరుగుతుంది

Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పించే సమస్య స్థూలకాయం, ఒంటిపై కొవ్వు పేరుకుపోవడం. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మాత్రం తప్పకుండా విముక్తి పొందవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..
 

Weight Loss Tips: స్థూలకాయం పోవాలంటే..డిన్నర్ ఎప్పుడు తీసుకోవాలి, కొవ్వు ఎలా కరుగుతుంది

Weight Loss Tips: ఆధునిక జీవనశైలిలో ప్రధానంగా కన్పించే సమస్య స్థూలకాయం, ఒంటిపై కొవ్వు పేరుకుపోవడం. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే మాత్రం తప్పకుండా విముక్తి పొందవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

వివిధ రకాల ఆహారపు ఆలవాట్ల కారణంగా శరీరంలోని వివిధ భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంటుంది. ఫలితంగా స్థూలకాయంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి. ఇది కేవలం మీ ఫిట్‌నెస్ పైనే కాకుండా..మీ ఫిజికల్ లుక్‌ను కూడా పాడు చేస్తుంది. కొవ్వును కరిగించుకునేందుకు వివిధ రకాల డైట్, ఎక్సర్‌‌సైజ్‌లు చేస్తుంటారు. అయినా స్థూలకాయాన్ని తగ్గించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అదే స్థూలకాయం పలు అనారోగ్య సమస్యలకు కారణమౌతుంటుంది. అందుకే స్థూలకాయం తగ్గించుకోవడమనేది ఓ అత్యవసరంగా మారింది. మరి స్థూలకాయం తగ్గించేందుకు ఏం చేయాలనేదే అసలు ప్రశ్న. ముఖ్యంగా రాత్రిపూట తినే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ..కొన్ని సూచనలు పాటిస్తే వేగంగా కొవ్వు కరగడమే కాకుండా స్థూలకాయం తగ్గుతుందంటున్నారు వైద్య నిపుణులు.

ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటుంటే..రాత్రి భోజనం సమయం పూర్తిగా మార్చేయాలి. ఎందుకంటే రాత్రి భోజనం జీర్ణక్రియ విషయంలో ఇబ్బందులుంటాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే మాత్రం సూర్యాస్తమయం కంటే ముందే మీ రాత్రి భోజనం అయిపోవాలి. అంటే సాయంత్రమే రాత్రి భోజనం పూర్తి కావాలి. 

డిన్నర్‌లో మిల్లెట్ దోశ, మిల్లెట్ పలావు వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే జీర్ణక్రియ సులభమవడమే కాకుండా..పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా..మిల్లెట్ ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉన్నట్టుగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆరోగ్యకరమైన పదార్ధాలు తీసుకోవాలి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. ఫలితంగా రాత్రి పూట తక్కువ తింటారు. అంటే సాయంత్రం వేళల్లో పండ్లు వంటివి తీసుకోవాలి. 

Also read: Food for Men: ఫిట్ అండ్ హెల్తీగా ఉండాలనుందా..అయితే ఈ డైట్ మాత్రమే తీసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More