Home> లైఫ్ స్టైల్
Advertisement

Weight loss: మొక్కజొన్న పొత్తులు ఇలా తింటే.. త్వరగా బరువుతగ్గడం ఖాయం!

Corn benefits: రుచికరమైన ధాన్యాలలో కార్న్ ఒకటి. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు A, C, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్ల వంటి సూక్ష్మపోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాక, మొక్కజొన్న బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం.

Weight loss: మొక్కజొన్న పొత్తులు ఇలా తింటే.. త్వరగా బరువుతగ్గడం ఖాయం!

Corn uses for weight loss: వర్షా కాలంలో వేడివేడి మొక్కజొన్నని రోస్ట్ చేసి, ఉప్పు, నిమ్మకాయతో తినడం మీకు ఇష్టమా? అయితే మీరు బరువు కూడా సులువుగా తగ్గిపోవచ్చు. కార్న్ ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. కూరగాయగా, చిప్స్ లాగా, స్నాక్ లాగా అనేక ఆహార పదార్థాల్లో కార్న్ ను ఉపయోగిస్తారు. కానీ దానివల్ల మనం బరువు కూడా తగ్గచ్చు అని కొంతమందికే తెలుసు.

బరువు తగ్గడానికి మొక్కజొన్న:

మొక్కజొన్నలో నీరు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆకలి తగ్గుతుంది, పొట్ట నిండుగా అనిపిస్తుంది. ఎక్కువ క్యాలరీలున్న, అనారోగ్యకరమైన ఆహారపదార్థాలకు బదులుగా మొక్కజొన్నను ఉపయోగించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల శరీరం క్యాలరీలను తీసుకోకుండా చేస్తుంది. మొక్కజొన్న మన జీర్ణవ్యవస్థకు కూడా చాలా మంచిది. 

బరువు తగ్గడానికి మొక్కజొన్నను ఎలా తినాలి?

వేడి వేడిగా వేయించిన మొక్కజొన్న తినడం చాలా సులభం మాత్రమే కాదు ఆరోగ్యకరం కూడా. వెన్న లేదా చాలా నూనె లో వేయించకుండా తినడం మంచిది. రుచి కోసం ఉప్పు మరియు నిమ్మరసం వేసుకోవచ్చు.

ఆవిరిలో ఉడికించిన మొక్కజొన్నను కొంచెం ఉప్పు, అల్లం వేసి తినవచ్చు. 

కార్న్, క్యాప్సికం, స్ప్రింగ్ ఓనియన్స్ వంటి కూరగాయలతో కలిపి ఫ్రై చేసి తినచ్చు. 

అన్నం తినేముందు కార్న్ సూప్ తాగడం వల్ల మీరు ఎక్కువగా తినకుండా ఉంటారు. బ్రోకలి, క్యారెట్, బీన్స్ వంటి ప్రోటీన్ లను సూప్‌లో కలపడం ద్వారా పోషక విలువ పెంచవచ్చు. కానీ సూప్ లో కార్న్‌స్టార్చ్, వెన్న వంటి వాటిని ఉపయోగించవద్దు.

స్వీట్ కార్న్‌తో ఛాట్, సలాడ్లు, తక్కువ క్యాలరీలున్న ఫ్రిటర్స్ కూడా తయారు చేయవచ్చు. 

బేబీ కార్న్ లో పోషకపదార్థాలు ఎక్కువగా ఉండేలా తయారు చేయవచ్చు. బేబీ కార్న్ సలాడ్ లేదా బేక్ చేసి స్నాక్ లాగా తిన్నా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఉదయాన్నే కార్న్ ఉప్మా చాలా పోషకంగా ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 

ఇలా మొక్కజొన్నను మీ ఆహారంలో చేర్చడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

Also Read: RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More