Home> లైఫ్ స్టైల్
Advertisement

Vitamin d Deficiency: విటమిన్‌ డి లోపం ఇలా వీటిని తినండి చాలు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు..

Vitamin d Deficiency: ప్రస్తుతం చాలా మంది విటమిన్‌ డి  లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా ఈ కింద పేర్కొన్న ఆహారాలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు విటమిన్‌ సమస్యలను తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

Vitamin d Deficiency: విటమిన్‌ డి లోపం ఇలా వీటిని తినండి చాలు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు..

Vitamin d Deficiency: శరీరంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్ పరిమాణాన్ని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఎముకలు, దంతాలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ డి సరైన పరిమాణంలో ఉంటే.. పిల్లలలో రికెట్స్ వంటి ఎముక వ్యాధుల ప్రమాదాన్ని, యువకులలో ఆస్టియోమలాసియా అనే అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది శరీరంలో దీని లోపం సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

విటమిన్ డి లోపం వల్ల ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలు ఇవే:
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల ఎముక సాంద్రత తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాకుండా బోలు ఎముకల వ్యాధితో పాటు, పగుళ్ల ప్రమాదాన్ని పెంచే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ డి అధిక లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ ఏర్పడవచ్చు. అంతేకాకుండా కాకుండా విటమిన్ డి లోపం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా రకాల దీర్ఘకాలీక వ్యాధులు వచ్చే ఛాన్స్‌ ఉంది.

విటమిన్ డి లోపం సంకేతాలు:
శరీరంలో విటమిన్ డి స్థాయి ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. తరచుగా ఫ్లూ లేదా జలుబు వంటి ఇన్ఫెక్షన్లు వస్తే.. తప్పకుండా అది విటమిన్ డి లేకపోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

విటమిన్ డి లోపం లక్షణాలు:
అలసట
నిద్రలేమి సమస్యలు
ఎముకలలో నొప్పి
నిరాశ లేదా విచారం
జుట్టు ఊడుటం
తక్కువ కండరాలు
ఆకలి నష్టం
విటమిన్ డి రిచ్ ఫుడ్

విటమిన్ డి లోపం తగ్గాడానికి తీసుకోవాల్సిన ఆహారాలు:
సాల్మన్, సార్డినెస్, హెర్రింగ్, మాకేరెల్ చేపలు
రెడ్‌ మీట్‌
కాలేయం
గుడ్డు పచ్చసొన
విటమిన్ డి సప్లిమెంట్స్
సూర్యరశ్మి

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్  

Also Read: Telangana Teacher Posts: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు..! 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

 

Read More