Home> లైఫ్ స్టైల్
Advertisement

Vitamin a Rich Foods: ఈ 5 రకాల కూరగాలు తింటే ఇక కళ్లకు అద్దాలు కూడా అవసరం లేదు.. కంటి చూపు సమస్యలన్నీ చెక్‌..

Vitamin a Rich Foods: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ కింద పేర్కొన్న 5 రకాల కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Vitamin a Rich Foods: ఈ 5 రకాల కూరగాలు తింటే ఇక కళ్లకు అద్దాలు కూడా అవసరం లేదు.. కంటి చూపు సమస్యలన్నీ చెక్‌..

Vitamin a Rich Foods: విటమిన్ ఎ అధికంగా ఉండే కూరగాయలు శరీరానికి చాలా అవసరం. వీటిల్లో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు కూడా లభిస్తాయ. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడేందుకు సహాయపడుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని తరచుగా ఆహారంలో తీసుకోవాలని సూచిస్తారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముఖ్యంగా కంటి చూపు సమస్యలు,  కంటి చూపు దెబ్బతినడం వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడాని ప్రధాన కారణాలు విటమిన్ ఎ లోపమేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కంటి చూపు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి ఈ 5 రకాల కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
బ్రోకలీ:

బ్రోకలీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషక విలువలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకుంటే శరీరానికి విటమిన్ ఎ లభించి కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో  60 మైక్రోగ్రాముల విటమిన్ లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.

కారెట్:
శీతాకాలంలో క్యారెట్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారాల్లో వినియోగిస్తే శరీరానికి 459 మైక్రోగ్రాముల విటమిన్ ఎ లభించి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా కంటి చూపు సమస్యలు కూడా తగ్గుతాయి.

గుమ్మడికాయ:
గుమ్మడికాయ అనేది భారతీయులు వంటకాల్లో తరచుగా వినియోగిస్తారు. ఇందులో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంతో  విటమిన్ ఎ లోపాన్ని తగ్గించి కంటి చూపును మెరుగుపరుచుతుంది.

పాలకూర:
శరీరానికి ఆకు పచ్చని ఆకు కూరలు చాలా అవసరం. ఇందులో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి బాడీని రక్షిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలున్న వారు ప్రతి రోజూ ఆకు కూరలను ఆహారంలో తీసుకుంటే వ్యాధులున్న తగ్గుతాయి. ముఖ్యంగా పాలకూరను ఆహారంలో తీసుకుంటే శరీరానికి దాదాపు 573 మైక్రోగ్రాములు లభించి కంటి చూపు సమస్యలు దూరమవుతాయి.

చిలగడదుంప:
తెలంగాణాలో చాలా మంది చిలగడదుంపను కందగడ్డ అని కూడా అంటారు. ఇది తినడానికి చాలా రుచిని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని ప్రతి రోజూ తింటే బాడీ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే బీటా-కెరోటిన్ శరీరానికి 1403 మైక్రోగ్రాముల విటమిన్ ఎ అందిస్తుంది. కాబట్టి దీనిని ఆహారంలో తీసుకుంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read : Shriya Saran lip lock : ఇది కామన్ ఏముంది అందులో.. బహిరంగంగా లిప్ లాక్ ట్రోలింగ్‌పై శ్రియా రియాక్షన్

Also Read : Faima Mother : ఫైమా, సత్యలు మారతారా?.. తల్లిదండ్రుల మాటలు వింటారా.. పెడచెవిన పెడతారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Read More