Home> లైఫ్ స్టైల్
Advertisement

Valentine Day 2022: వాలెంటైన్స్ డే రోజున మీరు సింగిల్ గా ఉన్నారా? అయితే ఇవి చేయండి!

Valentine Day 2022: ప్రేమికుల రోజు అంటే జంటలకు ప్రత్యేకమైనది. అయితే ఈ రోజున మీరు ఒంటరి అని భావిస్తున్నారా? అయితే వీటని ఫాలో అవ్వండి. మీరు ఒంటరి అనే ఫీలింగ్ మీ దరిదాపుల్లోకి కూడా రాదు. 
 

Valentine Day 2022: వాలెంటైన్స్ డే రోజున మీరు సింగిల్  గా ఉన్నారా? అయితే ఇవి చేయండి!

Valentine Day 2022: ఫిబ్రవరి 14 కోసం యువత ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే అది ప్రేమికుల రోజు! ఆ రోజున తమ జీవితాల్లోకి భాగస్వామిని ఆహ్వానిస్తారు. ఈ రోజు ప్రేమికులకు ప్రత్యేకంగా కేటాయించబడింది. ఇదే రోజున ప్రేమికులు అనేక ప్లాన్స్ చేస్తుంటారు. కానీ, ఇప్పుటికీ కొందరు సింగిల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వాలెంటైన్స్ డే నాడు ప్రేమికుల మాదిరి మీరు కూడా మిమ్మల్ని బిజీగా ఉంచుకోవచ్చు. అయితే అందుకు ఏం చేయాలో ఒకసారి చూద్దాం.  

మీ కోసం ఓ బహుమతి..

మీ కోసం ఏదైనా కొనేందుకు కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నారా? అయితే ఈ వాలెంటైన్స్ డే కు గుర్తుగా మీకు మీరు ఆ బహుమతిని ప్రజెంట్ చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్న తర్వాత ఇతరులను అంతే ప్రేమతో ప్రేమించగలరు. 

మీపై దృష్టి పెట్టండి

ఉరుకుల పరుగుల జీవితంలో మీకంటూ మీకు ఒక రోజు కేటాయించుకోండి. ఆ రోజు ఫిబ్రవరి 14 ఎందుకు కాకూడదు. ఈ రోజున మిమ్మల్ని మీరు అందంగా తయారు చేసుకోవడం, ఇష్టమైన ఫుడ్ తినడం, ఇష్టమైన ప్రదేశానికి వెళ్లడం, సినిమాలు, షికారులు.. ఇలా మరెన్నో బోలెడు విశేషాలు ఉన్నాయి. మీకు నచ్చిన పని చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా సాగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

డేట్ కు వెళ్లండి

డేటింగ్ కు వెళ్లడానికి ఇద్దరు వ్యక్తులు అవసరమని ఎవరు చెప్పారు? మీతో మీరు ఒక డేట్ ను ఫిక్స్ చేసుకోండి. ఆ డేట్ ను సరదాగా ఆస్వాదించండి. అందంగా ముస్తాబు అయ్యి.. నచ్చిన పని చేయడం వల్ల మనసు ఎంతో హాయినిస్తుంది. 

స్నేహితులతో పార్టీ..

వాలెంటైన్స్ డే ను ప్రత్యేకంగా చేయడానికి, మీ స్నేహితులతో పార్టీని ప్లాన్ చేసుకోవచ్చు. స్నేహితులతో కలిసి ఏదైనా విహారయాత్ర ప్లాన్ చేయవచ్చు. లేదంటే ఇంట్లోనే మీ స్నేహితులను పిలిచి పార్టీ ఇవ్వొచ్చు. అందరూ కలిసి ముచ్చట్లాడే సమయంలో మీరు ఒంటరి అనే ఊసే రాదు. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులతో రోజును గడపడం ఎంతో ఆనందంగా ఉంటుంది. 

మీలోని టాలెంట్ ను బయటకు తీయండి

మనలో చాలామందికి పాటలు అంటే చాలా ఇష్టం. కొందరు మనసులో పాడుకుంటారు, మరికొందరు బాత్రూమ్ సింగర్లు. అటువంటి పరిస్థితిలో, మీలో దాగి ఉన్న కళాకారుడిని బయటకు తీసుకురావడానికి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున ఇంట్లో మీకు ఇష్టమైన పాటలను ప్లే చేయండి. పాటలు పాడడం ఇష్టమైన పాటలకు డ్యాన్స్ చేయడం మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. 

Also Read: Happy Valentine Day: వాలెంటైన్ డే చరిత్ర ఏంటి, ప్రేమికుడి త్యాగం లేదా ఇందులో..మరెందుకీ ప్రేమికుల రోజు

Also Read: Propose Day 2022: ప్రపోజ్ డే ప్రాముఖ్యత.. ఈ రోజున మీ ప్రేమను అసలు మిస్ కావొద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Read More