Home> లైఫ్ స్టైల్
Advertisement

Skin Care: ముఖంపై ట్యాన్ పోయి.. గ్లో రావాలంటే ఇంట్లోనే ఈ స్క్రబ్ తయారు చేసుకోండి.. 

Home made Face Scrub: మన బిజీ లైఫ్‌ లో స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతాం. అంత సమయం కూడా వెచ్చించాలేం. అయితే, కనీసం వారానికి ఒకసారి అయినా చర్మ సంరక్షణ చర్యలు చేపట్టడం మంచిది. ఆఫీస్ లేదా బయట ఏదైనా పనులకు వెళ్లినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది.

Skin Care: ముఖంపై ట్యాన్ పోయి.. గ్లో రావాలంటే ఇంట్లోనే ఈ స్క్రబ్ తయారు చేసుకోండి.. 

Home made Face Scrub: మన బిజీ లైఫ్‌ లో స్కిన్ కేర్ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోతాం. అంత సమయం కూడా వెచ్చించాలేం. అయితే, కనీసం వారానికి ఒకసారి అయినా చర్మ సంరక్షణ చర్యలు చేపట్టడం మంచిది. ఆఫీస్ లేదా బయట ఏదైనా పనులకు వెళ్లినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది. బయటకు ఎప్పుడూ వెళ్లినా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మం డ్యామేజ్ అవుతే తిరిగి నెలకొల్పుకోవడానికి వేలలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయినా వాటి కెమికల్స్ వల్ల రియాక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే వస్తువులతో ట్యాన్ తొలగించే చిట్కాలు ఉన్నాయి. వీటితో మీ ముఖానికి నేచురల్ గ్లో వస్తుంది. ఈ రెమిడీ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. వెంటనే ముఖంపై గ్లో కనిపిస్తుంది.

చర్మంపై ట్యాన్ తొలగించడానికి కావాల్సిన పదార్థాలు..
బియ్యం పిండి
తేనె
కలబంద గుజ్జు
రోజ్ వాటర్
పసుపు

ఇదీ చదవండి:  ఇంట్లోనే రెస్టారెంట్‌ స్టైల్‌ చిల్లీ పనీర్ రెసిపీని ఇలా తయారు చేసుకోండి..

బియ్యం పిండిలో చిటికెడు పసుపు, చెంచా తేనె, టీస్పూన్ కలబంద, తగినన్ని రోజ్ వాటర్ కలుపుకుని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇది చర్మం పై స్ర్కబ్ మాదిరి మసాజ్ చేయాలి. ముఖంపై మాత్రమే కాకుండా సూర్యరశ్మికి బయటకు కనిపించే అన్ని ప్రాంతాల్లో నెమ్మదిగా స్ర్కబ్ చేయండి. ఈ ప్యాక్ ను కాసేపు అంటే 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. 

ఆ తర్వాత వాటర్ కొద్దికొద్దిగా తీసుకుంటూ చర్మంపై మృదువుగా మర్ధన చేయాలి. ఆ తర్వాత సాధారణనీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. మీ ముఖంపై వెంటనే గ్లో వచ్చి మృదువుగా మారుతుంది. ఇందులో వాడిన కలబంద మీ ముఖంపై మాయిశ్చర్‌ను నిలుపుతుంది. శనగపిండి, పసుపుతో మీ ముఖంపై ఉన్న ట్యాన్ తొలగి గ్లో వస్తుంది. ఇందులో పాలు కూడా కలుపుకోవచ్చు. జిడ్డు చర్మం ఉన్నవారు పాలకు బదులుగా రోజ్ వాటర్ ను ఉపయోగించాలి.

ఇదీ చదవండి: మద్యం తాగేటప్పుడు ఈ పదార్థాలు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!

అంతేకాదు, బయటకు ఎండలో వెళ్లినప్పుడు ముఖం కవర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు వేసుకోండి. బయటకు ఎండలో వెళ్లాల్సి వచ్చినప్పుడు సన్‌స్క్రీన్ అప్లై చేసుకుని వెళ్లండి. పేస్ వాష్ తర్వాత కచ్ఛితంగా మాయిశ్చరైజర్ రుద్దుకోండి. ముఖంపై ఏవైనా ఫేస్ మేకప్ వేసుకుంటే రాత్రి పడుకునే ముందు దాన్ని తీసేయండి. ఇలా సరైన జాగ్రత్తలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా అందంగా ఉంటుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More