Home> లైఫ్ స్టైల్
Advertisement

Tomato Side Effects: అతిగా టొమాటోలను తింటున్నారా.. ఇక అంతే సంగతి, ఈ వ్యాధులు తప్పవు..


Tomato Side Effects: ఏ ఆహారాలైనా అధిక తీసుకోవడం వల్ల శరీరానికి దుష్ప్రభావాలు ఎదురవుతాయి. అయితే ప్రస్తుతం చాలామంది టమాటాలను విచ్చలవిడిగా వంటకాల్లో వినియోగిస్తున్నారు. ఇలా వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యల అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

Tomato Side Effects: అతిగా టొమాటోలను తింటున్నారా.. ఇక అంతే సంగతి, ఈ వ్యాధులు తప్పవు..

Tomato Side Effects: టొమాటోలను అందరూ చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వీటిని స్పైసి డిష్ తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఫాస్పరస్, కాల్షియం, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో శరీరానికి మేలు చేసే చాలా రకాల గుణాలు ఉన్నాయి. అయితే ఏ ఆరాలైన అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టొమాటోలను తీసుకోవడం వలన తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అయితే ఆనారోగ్య సమస్యలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మూత్రపిండంలో రాళ్లు:
టొమాటోలో ఆక్సలేట్ అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి వీటిని అతిగా తీసుకోవడం వల్ల  కిడ్నీ ల్లో స్టోన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. కాబట్టి వీటిని వీటిని అతిగా తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. 

అతిసారం:
మాటలను ఆహారాల్లో అతిగా వినియోగించడం వల్ల పలుసార్లు విరేచనాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో సాల్మొనెల్లా బ్యాక్టీరియా డయేరియా సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి తక్కువ మోతాదులోని ఆహారాల్లో టమోటాలను వినియోగించాల్సి ఉంటుంది.

కీళ్ల నొప్పులు:
కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం. అయితే ఇతర సీజన్లో కీళ్ల నొప్పులు వస్తే దానికి ప్రధాన కారణం అతిగా టమోటాలను వినియోగించడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు చలికాలంలో టమాటాలను అతిగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పొట్టలో గ్యాస్:
టమోటాలు గా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చేస్తున్నారు కాబట్టి పొట్ట సమస్యలు ఉన్నవారు టమోటాలను పరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Rain Alert For AP: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు  

Also Read: LC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More