Home> లైఫ్ స్టైల్
Advertisement

Blood Group: ఈ బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు పొరపాటున కూడా చికెన్, మటన్ తినకూడదు..

Blood Group: ఈ కాలంలో ఎక్కువశాతం ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లున్నారు. మరికొంతమంది వెజ్ ప్రియులు ఉన్నారు. కొందరు నాన్ వెజ్ నుంచి వెజ్‌కు మళ్లుతున్నవారు ఉన్నారు.

Blood Group: ఈ బ్లడ్ గ్రూప్‌ ఉన్నవారు పొరపాటున కూడా చికెన్, మటన్ తినకూడదు..

Blood Group: ఈ కాలంలో ఎక్కువశాతం ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లున్నారు. మరికొంతమంది వెజ్ ప్రియులు ఉన్నారు. కొందరు నాన్ వెజ్ నుంచి వెజ్‌కు మళ్లుతున్నవారు ఉన్నారు. ఎందుకంటే నాన్ వెజ్‌తో పోలిస్తే వెజిటేరియన్ ఫుడ్ ఆరోగ్యకరం. ముఖ్యంగా నాన్ వెజ్ తినేవారిలో ఆరోగ్య సమస్యలు వచ్చిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి.

చికెన్, మటన్ లో అనేక రకాల వంటకాలు ఉంటాయి. సాధారణంగా ఆదివారం లేదా ఇంట్లో ఏదైనా వేడుకలు జరిగినప్పుడు చికెన్, మటన్ వండుకుంటారు. ఏ పెళ్లిరోజూ, పుట్టినరోజు వేడుకలు అయినా చికెన్, మటన్, బిర్యానీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే, కొన్ని రక్తం గ్రూపుల వారు చికెన్, మటన్ తినకూడదని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: మనీప్లాంట్‌ను ఇలా గాజు బాటిల్లో సులభంగా పెంచుకోండి..

సాధారణంగా మన బ్లడ్ గ్రూపుల్లో ఏ, ఏబీ, ఓ, బీ రకాలు ఉన్నాయి. వీటని అనుసరించి మనం ఆహారం తీసుకోవాలి. రక్తవర్గం బట్టి మన డైట్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఆరోగ్యకరంగా ఉంటాం. అయితే, 'A' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరికి అధికంగా జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయి. ముఖ్యంగా ఈ రక్త వర్గం వారు నాన్ వెజ్ వంటలు తినకూడదు. మాంసాహారం తక్కువగా తీసుకోవాలి. వీళ్లు చికెన, మటన్, గుడ్లు వంటివి తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రక్తం వర్గం వారికి జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఇది కేవలం ఏ రక్తం వర్గం వారికి మాత్రమే కాదు AB రక్త వర్గం వారికి కూడా వర్తిస్తుంది. 'O' బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కూడా ప్రోటీన్ ఆధారిత ఆహారాలు తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: ఈ 6 లక్షణాలు కనిపిస్తే గుండెపోటే..! ఏం చేయాలంటే..?  

B బ్లడ్ గ్రూప్ ఉన్నవారు నాన్ వెజ్ తినవచ్చు. ఎందుకంటే వీరి జీర్ణవ్యవస్థ కూడా మెరుగ్గా ఉంటుంది. ఈ గ్రూపు వాళ్లు చికెన్, మటన్, గుడ్డు ఏ ఆందోళన లేకుండా భేషుగ్గా తినవచ్చు. అయితే, ఏదైనా పరిమితి మించకుండా ఉంటే ఫర్వాలేదు. ఎన్నో నివేధికల్లో కూడా నాన్ వెజ్ కంటే వెజ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి. ఏ బ్లడ్‌ గ్రూపు వారు చికెన్, మటన్ తినకుండా జాగ్రత్త పడటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు తమ బ్లడ్ గ్రూపు ఆధారంగా లైఫ్ స్టైల్ నిర్వహించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More