Home> లైఫ్ స్టైల్
Advertisement

Summer Skin Care: వేసవి చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసే చిట్కా ఇదే

Summer Skin Care: వేసవి వచ్చేసింది. ఓ పక్క ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో ఆరోగ్యంతో పాటు చర్మాన్ని కూడా పరిరక్షించుకోవల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చర్మం డీ హైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ చిట్కాలు ఏంటనేది తెలుసుకుందాం..

Summer Skin Care: వేసవి చర్మ సంరక్షణలో అద్భుతంగా పనిచేసే చిట్కా ఇదే

Summer Skin Care: శరీరం ఒక్కటే కాదు చర్మం కూడా డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. చర్మం హైడ్రేట్‌గా లేకపోతే జీవం కోల్పోయి కళా విహీనమౌతుంటుంది. అయితే వేసవిలో ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఒకే ఒక పదార్ధం చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కీరా అనేది ఆరోగ్యపరంగా అద్భుతమైన పదార్ధం. ఇందులో 95 శాతం నీరే ఉంటుంది. అందుకే కీరా ఎక్కువగా సేవించడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచవచ్చు. కీరా అనేది కేవలం ఆరోగ్యానికే కాదు చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా ఉపయోగడుతుందని చాలా తక్కువమందికి తెలుసు. కీరాతో ఫేసియల్ చేయడం వర్ల చర్మం లోపల్నించి హైడ్రేట్ అవుతుంది. ఫలితంగా మీ చర్మం జీవం కోల్పోకుండా కళకళలాడుతుంటుంది. సన్‌బర్న్ నుంచి ఉపశమనం పొందేందుకు కూడా కీరా ఉపయోగపడుతుంది. దీంతోపాటు కీరాలో పుష్కలంగా ఉండే యాంటీ ఏజీయింగ్ గుణాల కారణంగా వయస్సు పెరిగినా ఆ లక్షణాలు దూరంగా ఉంటాయి.

కీరా ఫేసియల్ మాస్క్ తయారు చేసే విధానం

కీరా ఫేసియల్ తయారు చేసేందుకు కీరా రసం, రోజ్ వాటర్, మినరల్ వాటర్ ఉంటే చాలు. ముందుగా కీరా తీసుకుని ముక్కలు చేసి వాటిని గట్టిగా పిండటం ద్వారా లేదా మిక్సీ చేసి రసం తీయాలి. ఈ రసంలో రోజ్ వాటర్, మినరల్ వాటర్ కలపాలి. అన్నింటిని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ పుదీనా రసం కలిపినా బాగుంటుంది. రోజుకు 2 సార్లు ఈ మిశ్రమాన్ని ముఖంపై స్ప్రే చేసుకుని ఓ 20 నిమిషాలుండాలి. ఆ తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఎప్పుడూ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. 

Also read: Herbal Tea: ఈ హెర్బల్ టీ మోతాదు మించి ఎవరెవరు తాగకూడదు, ఏమౌతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More