Home> లైఫ్ స్టైల్
Advertisement

Skin Care Tips: సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ మధ్య తేడా ఏంటి, ఏది ఎప్పుడు రాసుకోవాలి

Skin Care Tips: చర్మ సంరక్షణ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా చలికాలంలో. ఈ క్రమంలో చర్మ సంరక్షణకు సంబంధించిన కొన్ని కీలకమైన విషయాల్ని తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ముఖ్యమైంది మాయిశ్చరైజర్కు సన్‌స్క్రీన్‌కు ఉన్న తేడా.

Skin Care Tips: సన్‌స్క్రీన్, మాయిశ్చరైజర్ మధ్య తేడా ఏంటి, ఏది ఎప్పుడు రాసుకోవాలి

చర్మ సంరక్షణలో ఏ విధమైన నిర్లక్ష్యం మంచిదికాదు. స్కిన్ కేర్ కోసం సరైన ప్రొడక్ట్‌ను ఎంచుకోవల్సి ఉంటుంది. చాలా రకాల చిట్కాలు కూడా చర్మ సంరక్షణలో దోహదపడతాయి. అదే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాల్ని తెలుసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..

చర్మ సంరక్షణలో కీలకంగా ఉపయోగపడేవి రెండు. ఒకటి మాయిశ్చరైజర్ కాగా, రెండవది సన్‌స్క్రీన్. అయితే ఈ రెండింటికీ మధ్యం అంతరమేంటనేది చాలామంచిది తెలియదు. ఈ రెండింటికీ మధ్య తేడా ఏంటనేది ఇప్పుుడు తెలుసుకుందాం..రెండింటికీ తేడా తెలుసుకోకుండా వినియోగిస్తే హాని చేకూరే ప్రమాదముంది.

మాయిశ్చరైజర్

ముందుగా మాయిశ్చరైజర్ గురించి తెలుసుకుందాం. చర్మాన్ని తేమగా అంటే హైడ్రేట్‌గా ఉంచేందుకు మాయిశ్చరైజర్ వినియోగిస్తాము. చలికాలంలో చర్మం సహజంగానే ఎండిపోతుంటుంది. అందుకే చలికాలంలో మాయిశ్చరైజర్ అధికంగా వినియోగిస్తుంటారు. రాత్రి నిద్రపోయే ముందు లేదా స్నానం తరువాత రాయాలి.

సన్‌స్క్రీన్

ఎండలో తిరిగేటప్పుడు ట్యానింగ్, హానికల్గించే కిరణాల్నించి రక్షించే క్రీమ్‌ని సన్‌స్క్రీన్ అంటారు. సూర్య కిరణాలు నేరుగా శరీరంలో ఏ భాగంపై పడతాయో ఆ భాగంపై సన్‌స్క్రీన్ రాసుకోవాలి. సన్‌స్క్రీన్‌ను సన్‌బ్లాక్, సన్‌బర్న్, సన్‌ట్యాన్ లోషన్‌గా కూడా పిలుస్తారు. 

అంటే మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రెండూ చర్మ సంరక్షణకు చాలా అవసరం. చర్మం డ్రైగా ఉన్నప్పుడు రెండూ వినియోగించాల్సి ఉంటుంది. డ్రైగా లేకపోతే మాత్రం కేవలం నస్ స్క్రీన్ వినియోగిస్తే సరిపోతుంది. రెండింటిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనేది గుర్తుంచుకోవాలి. మాయిశ్చరైజర్‌ను ఎప్పుడూ సన్‌స్క్రీన్ కంటే ముందు రాయాలి. 

Also read: Vitamin a Rich Foods: ఈ 5 రకాల కూరగాలు తింటే ఇక కళ్లకు అద్దాలు కూడా అవసరం లేదు.. కంటి చూపు సమస్యలన్నీ చెక్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More