Home> లైఫ్ స్టైల్
Advertisement

Skin Care Tips: నిగనిగలాడే ముఖం కావాలంటే ఆలివ్ ఆయిల్ ఇలా వాడాల్సిందే

Skin Care Tips: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చర్మం నిర్జీవంగా, పాలిపోయినట్టుండటం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా రకాల ఉత్పత్తులు వాడి విఫలమౌతుంటారు. 

Skin Care Tips: నిగనిగలాడే ముఖం కావాలంటే ఆలివ్ ఆయిల్ ఇలా వాడాల్సిందే

Skin Care Tips: అందం సగం ఆరోగ్యం. అందుకే అందాన్ని కాపాడుకోవడంలో చర్మ సౌందర్యం లేదా చర్మ పరిరక్షణ చాలా అవసరం. ఇటీవలి కాలంలో ప్రధానంగా ఉన్న సమస్య కూడా ఇదే. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మార్కెట్‌లో లభించే కెమికల్ ఉత్పత్తులు కాకుండా సహజసిద్ధమైన చిట్కాలతో చర్మాన్ని అందంగా, నిగనిగలాడేలా కాపాడుకోవచ్చు.

ఇటీవలి కాలంలో దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి చర్మం పాలిపోయినట్టుండటం, నిర్జీవంగా ఉండటం. దీనివల్ల చర్మ సౌందర్యం దెబ్బతింటుుది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. అయితే సహజసిద్ధమైన కొన్ని చిట్కాలతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపర్చుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా చేసేందుకు ముఖంపై నిగారింపు కోసం జైతూన్ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. జైతూన్ ఆయిల్ ఎలా వినియోగించాలో తెలుసుకుందాం..

జైతూన్ ఆయిల్-పెరుగు

జైతూన్ ఆయిల్‌తో పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉంటే డార్క్ సర్కిల్స్ దూరమౌతాయి. చర్మానికి నిగారింపు కూడా వచ్చి చేరుతుంది. రోజూ క్రమం తప్పకుండా రాస్తే చర్మం నిగనిగలాడుతుంది.

జైతూన్ ఆయిల్-పసుపు

ప్రకృతిలో లభించే సహజసిద్ధమైన యాంటీ బయోటిక్ పసుపుని జైతూన్ ఆయిల్‌తో కలిపి రాయడం వల్ల ముఖంపై నల్లని మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. అయితే వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. 

జైతూన్ ఆయిల్-నిమ్మకాయ

జైతూన్ ఆయిల్‌తో పాటు నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి. దాంతోపాటు ముఖంపై ఉండే వ్యర్ధాలు కూడా తొలగిపోతాయి. ముఖం క్లీన్ అవుతుంది. 

జైతూన్ ఆయిల్-తేనె

జైతూన్ ఆయిల్‌తో పాటు తేనె కొద్దిగా కలుపుకుని తాగడం వల్ల చర్మానికి నిగారింపు వస్తుంది. చర్మం టైట్‌గా మారుతుంది. ముఖానికి రాసుకున్న తరువాత కాస్సేపు ఉంచి అప్పుడు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ముఖం నిగనిగలాడనుంది.

Also read: Home Remedies: మలబద్ధకం అదే పనిగా బాధిస్తోందా, ఇలా చేసి చూడండి, తక్షణ ఉపశమనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More