Home> లైఫ్ స్టైల్
Advertisement

Face Pack for Glowing Skin: చందనం పేస్ ప్యాక్ వాడితే 10 రోజుల్లో మిళ మిళ మెరిసే ముఖం మీ సొంతం!

Face Pack for Glowing Skin: సంరక్షణ చాలా అవసరం. కేవలం అంతర్గత ఆరోగ్యం గురించే కాకుండా బాహ్య ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అందం సగం ఆరోగ్యం కూడా. చర్మ సంరక్షణకు ఏం చేయాలనేది పరిశీలిద్దాం..

Face Pack for Glowing Skin: చందనం పేస్ ప్యాక్ వాడితే 10 రోజుల్లో మిళ మిళ మెరిసే ముఖం మీ సొంతం!

Sandal Face Pack for Glowing Skin: చర్మ సంరక్షణ, ముఖ సౌందర్యం కోసం ప్రకృతిలో వివిధ రకాల పదార్ధాలు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్‌లో లభించే బ్యూటీ ఉత్పత్తులతో ఆశించిన ఫలితాలు కలగకపోగా, దుష్పరిణామాలు ఎదురౌతుంటాయి. అందుకే ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణకు సాధ్యమైనంతవరకూ హోమ్ రెమిడీస్ మాత్రమే పాటిస్తే మంచిది.

చందనం అనేది అనాదిగా ఉన్న అద్భుతమైన ఔషధం. చర్మం సంరక్షణలో చందనానికి మించింది లేదు. చర్మానికి కూలింగ్ అందించడంలో చందనం అద్భుతంగా పనిచేస్తుంది. ముఖాన్ని డీప్ క్లీన్ చేయడంలో దోహదపడుతుంది. ముఖ్యంగా వేసవిలో చందనం మిశ్రమం చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ సౌందర్యం కోసం చందనం ఫేస్‌ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. వేసవి కాలంలో చందనం రాయడం వల్ల ట్యానింగ్ సమస్య తొలగడమే కాకుండా డెడ్ స్కిన్ పోతుంది. అంతేకాకుండా చందనం రాయడం వల్ల ఏజియింగ్ లక్షణాలు తగ్గిపోతాయి. ముఖంపై ఏర్పడే యాక్నే, పింపుల్స్ వంటి సమస్యలు దూరమౌతాయి. చందనం ఫేస్‌ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

చందనం ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు 1-3 స్పూన్స్ రోజ్ వాటర్ అవసరమౌతుంది. దీంతోపాటు విటమిన్ ఇ క్యాప్సూల్ 1, 3 స్పూన్స్ చందనం పౌడర్ కావాలి. చందనం ఫేస్‌ప్యాక్ తయారు చేసేందుకు ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. ఇందులో దాదాపు 3 స్పూన్స్ చందనం పౌడర్ వేయాలి. ఆ తరువాత ఇందులో 1 విటమిన్ ఇ క్యాప్సూల్ ఓపెన్ చేసి వేయాలి. చివరిగా ఇందులో 2-3 స్పూన్స్ రోజ్ వాటర్ వేస మూడింటినీ బాగా కలపాలి. అంతే మీక్కావల్సిన చందనం ఫేస్‌ప్యాక్ సిద్ధమైనట్టే.

చందనం ఫేస్‌ప్యాక్ రాసే ముందు ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చందనం ఫేస్‌ప్యాక్‌ను పూర్తిగా రాసుకోవాలి. ఆ తరువాత దాదాపు 20 నిమిషాలు అలానే ఉంచి..కాటన్, వాటర్ సహాయంతో క్లీన్ చేసుకోవాలి. వారంలో 2-3 సార్లు రాస్తే మంచి ఫలితాలుంటాయి. వేసవి కాలంలో చందనం పౌడర్ చర్మానికి చలవ కల్గిస్తుంది. ముఖంపై ట్యానింగ్ సమస్యను పోగొడుతుంది. చందనం ప్యాక్ సహాయంతో ముఖం క్లీన్సింగ్ ప్రక్రియకు దోహదమౌతుంది.

Also Read: Healthy Fruits: రోజూ డైట్‌లో ఈ పండ్లు ఉంటే చాలు..కిడ్నీ సమస్యలు ఎప్పటికీ దరిచేరవు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More