Home> లైఫ్ స్టైల్
Advertisement

Phone Addiction: ఇలా చేస్తే చాలు…సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి మీరు, మీ పిల్లలు బయటపడవచ్చు

Cell Addiction: ప్రస్తుతం తరం వారికి సెల్ ఫోన్ అనేది అవసరం కన్నా ఎక్కువ వ్యసనంగా మారిపోతుంది. పెద్దలు.. పిల్లలు అనే తేడా లేకుండా ఈ సెల్ ఫోన్ అందరి జీవితంలో ఒక పెద్ద ప్రమాదంగా మారుతుంది. కాగా అవసరానికి మించి మీరు కానీ ఫోన్ వాడుతుంటే.. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యి చూడండి..

Phone Addiction: ఇలా చేస్తే చాలు…సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి మీరు, మీ పిల్లలు బయటపడవచ్చు

Mobile Addiction: సెల్ ఫోన్ తో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అయితే నాణ్యానికి బొమ్మ ..గొరుసు ఉన్నట్టే.. సెల్ ఫోన్ వల్ల ఉపయోగాలు.. ప్రమాదాలు రెండు ఉన్నాయి. సెల్ ఫోన్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మన చేతిలో సెల్ ఫోన్ లేకుంటే కనీసం గంట కూడా గడవదు. ఈ ఫోన్ ని అవసరానికి వారే వారు కొంతమంది అయితే.. అనవసరంగా వారేవారు ఎంతోమంది. అంతేకాదు అవసరానికి మించి వారేవారు అందరూ.

ఉదయాన్నే నిద్ర లేవగానే సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంటాం .. ఇక రాత్రి పడుకునే ముందు ఆ సెల్ ఫోన్ తీసి మన పక్కన పెట్టుకుంటాం. ఇక రోజు మొత్తం అది మనతోనే ఉంటుంది. కొంతమంది అయితే బాత్రూంలోకి వెళ్లేటప్పుడు కూడా సెల్ ఫోన్లు తీసుకుపోతున్నారు. ఈ సెల్ ఫోన్ కి అడ్డిక్ట్ అయిపోతున్నారు ప్రజలు. ఇక పెద్దలను చూసి పిల్లలు కూడా ఇదే తీరు నేర్చుకుంటున్నారు. పిల్లలు కొంచెం రచ్చ చేస్తే చాలు వారి చేతిలో సెల్ ఫోన్ పెట్టేస్తున్నారు పెద్దలు. ఇలా మనకు తెలియకుండానే మనం మన పిల్లలు సెల్ ఫోన్ చేతిలో తోలు బొమ్మలు అయిపోతున్నాం. మన చేతిలో సెల్ ఫోన్ కాదు సెల్ ఫోన్ చేతిలోనే మనం ఉంటున్నాం

కాగా ఈ మధ్య జరిగిన ఒక సర్వే ప్రకారం  92% మంది ప్రజలు సెల్ ఫోన్ తమ జీవితంలో భాగంగా భావిస్తున్నారట. 81% మంది పిల్లలు కూడా ఇలాగే భావిస్తున్నారట. ఇక 90% మంది సెల్ ఫోన్ పాడైతే ఆందోళన చెందుతున్నారట. 80% మంది పిల్లలు తమను తాము ఆన్ లైన్ ఇన్ఫ్లుయెన్సర్ లతో పోల్చుకుంటున్నారట. మరి ఇలా అయినా మన జీవితంలో సెల్ ఫోన్ నుంచి బయట పడాలి అంటే ఇలా చిన్నవి ఫాలో అవ్వండి ..

ఈ అడిక్షన్ నుండి బయటపడాలంటే ముందుగా అసలు ఫోన్ తో మీరు ఎంత సమయం గడుపుతున్నారో తెలుసుకోవాలి. మీరు ఫోన్ తో ఉన్నారు అంటే.. మీరు మరే పని చేయడం లేదని అంతేకాదు కనీసం మిమ్మల్ని ప్రేమించే వారితో కూడా కూర్చొని మాట్లాడటం లేదని అర్థం. కాబట్టి ప్రతి 20 నిమిషాలకు మీరు ఫోన్ తో ఎంత సమయం వృధా చేశారో నోట్ చేసుకుంటూ ఉండండి. ఫోన్ మాట్లాడిన ప్రతిసారి ఎంత సమయం కాల్ మాట్లాడుతున్నారో కూడా లెక్కించుకోవాలి.  ఇక ఈ లెక్కతో  సంవత్సరం మొత్తంలో ఎంత సమయాన్ని ఫోన్ మాట్లాడటం కోసం వినియోగిస్తున్నామో కూడా లెక్కలు వేసుకోవాలి. అప్పుడు మీకు ఫోన్ తో మీ జీవితాన్ని ఎంత గడిపేసారో అర్థమవుతుంది..

ఎప్పుడు ఫోన్ ఛార్జింగ్ పాయింట్ బెడ్‌కి దగ్గరలో ఉంచుకోకండి. ఎందుకంటే అలా ఉంటే చార్జింగ్ లో పెట్టి నిద్రపోకుండా ఫోన్ పట్టుకొనే ఉంటాం.. అంతేకాదు మీకు ఇష్టం ఉన్న లేకపోయినా ఎక్కువగా ఫోన్ మాట్లాడటం ఇష్టం లేదన్న విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మధ్య చెబుతూ ఉండాలి. 

మీరు భోంచేసే సమయంలో అసలు ఫోన్ మీ దరిదాపుల్లో కూడా పెట్టుకోవద్దు. మరీ ముఖ్యంగా మీ ఫోన్ వాల్ పేపర్ కూడా మిమ్మల్ని ఫోనువైపు అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఫోన్ సెట్టింగ్ ని మార్చండి. ఫోన్ వాల్ పేపర్ గా నలుపు, లేదా తెలుపు వాల్ పేపర్లు పెట్టుకోవడం వల్ల ఫోన్ అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది. ఏదైనా బ్లాక్ ఇమేజ్ పెట్టుకున్న మీకు ఫోన్ చూడగానే ఎక్కువ వాడకూడదు అనిపిస్తుంది.

హోమ్ స్క్రీన్‌పై ఎక్కువగా ఉపయోగించే యాప్‌లను ఉంచకండి. వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటివి అస్సలు హోం స్క్రీన్ పైన పెట్టుకోకండి. 

ఇవన్నీ ఫాలో అయ్యి చూడండి కనీసం కొంచెం సమయం అన్న మీరు సెల్ ఫోన్ తో గడపడం తగ్గించి బయట ప్రపంచాన్ని చూడడానికి మొగ్గు చూపించవచ్చు.. మనం ఎంత తొందరగా ఈ సెల్ ఫోన్ వ్యసనం నుంచి బయటపడితే మన రాబోయే తరాలకు అంత మంచిది మరి. 

Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More