Home> లైఫ్ స్టైల్
Advertisement

Liver Health: నాన్ ఆల్కహాల్‌ వారికి లీవర్‌ ఎందుకు దెబ్బతింటుంది? కారణాలు ఇవే

Liver Problem Causes: లివర్ మన శరీరంలో కీలక ప్రాతను పోషిస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయి. అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది లివర్‌ సమస్యలతో బాధపడుతున్నారు దీనికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. 
 

Liver Health: నాన్ ఆల్కహాల్‌ వారికి లీవర్‌ ఎందుకు దెబ్బతింటుంది? కారణాలు ఇవే

Liver Problem Causes: ప్రస్తుతకాలంలో చాలా మంది ఆల్కహాల్‌, ధూమపానం వంటి అలవాట్లకు బానిస అవుతున్నారు. అధికంగా ఆల్కహాల్‌, ధూమపానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా లివర్‌ వ్యాధితో ఎక్కువ మంది మరణిస్తున్నారు. కానీ ఎలాంటి అలవాట్లు లేని వారు కూడా లివర్‌ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, మారిన జీవనశైలి అని నిపుణులు చెబుతున్నారు. అసలు లివర్‌ డిసీజ్‌ ఎలా వస్తుంది. ఎందుకు నాన్ ఆల్కహాల్‌ వారికి లీవర్‌ దెబ్బతింటుంది అనేది మనం తెలుసుకుందాం. 

లివర్ వ్యాధికి కారణాలు:

లివర్ (కాలేయం) మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి. ఇది విషపదార్థాలను తొలగించడం, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటం వంటి అనేక ముఖ్యమైన పనులు చేస్తుంది. కానీ అనేక కారణాల వల్ల లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందులో   హెపటైటిస్ A, B, C, D, E వంటి వైరస్‌లు లివర్ వ్యాధికి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.  దీర్ఘకాలికంగా అధిక మద్యం తాగడం వల్ల లివర్‌ దెబ్బతింటుంది. 

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్  ఎలా సంభవిస్తుంది అంటే అధిక బరువు, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఈ సమస్య కలుగుతుంది.  అలాగే కొన్ని రకాల మందులు దీర్ఘకాలిక వినియోగం కూడా లివర్‌ను ప్రభావితం చేస్తుంది.

శరీర నిరోధక వ్యవస్థ కాలేయాన్ని దాడి చేయడం వల్ల కలిగే వ్యాధులు. కొన్ని జన్యుపరమైన వ్యాధులు కాలేయ వ్యాధికి దారితీస్తాయి. రకాల రసాయనాలు, విషపదార్థాలు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఈ విధంగా లివర్‌ సమస్య కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం, జాగ్రత్తలు తీసుకోవాలంటే జీవనశైలి, ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకొనే ఆహారంలో కొన్ని రకాల పదార్థాలను తినాలి. ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి, ఎలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి అనేది తెలుసుకుందాం. 

లివర్ వ్యాధి రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం ఎంతో ముఖ్యం. కొన్ని రకాల ఆహారాలు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి, మరికొన్ని దెబ్బతీస్తాయి. ముందు ఆరోగ్యకరమైన పదార్థాలు గురించి తెలుసుకుందాం.

లివర్‌ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజు విటమిన్‌లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉన్న పండ్లు, కూరగాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి లభించే వాటిలో యాపిల్‌, బెర్రీలు, బ్రోకలీ, కాలీఫ్లవర్‌ మంచిది. వీటితో పాటు బ్రౌన్‌ రైస్‌, ఓట్స్‌ వంటి ధాన్యాలు తీసుకోవడం వల్ల ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.  చికెన్, చేప, బీన్స్ వంటి లీన్ ప్రోటీన్‌లు కాలేయం ఆరోగ్యానికి మంచివి.  ఆలివ్ ఆయిల్, అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

దూరంగా ఉండవలసిన ఆహారాలు:

లివర్‌ వ్యాధి ఎక్కువగా ఆహారంలో చక్కెర ఉండటం వల్ల వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అలాగే అధిక శాతంలో రెడ్ మీట్, బటర్ వంటి సంతృప్త కొవ్వులు కాలేయానికి హానికరం. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ కాలేయం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఆహారంలో అధిక సోడియం కాలేయంపై ఒత్తిడిని పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.  అధిక మద్యపానం కాలేయాన్ని దెబ్బతీస్తుంది. అధిక బరువు లేదా స్థూలకాయం లివర్ వ్యాధికి ప్రధాన కారణం. కాబట్టి ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల  కాలేయం ఆరోగ్యానికి మంచిది. 

గమనిక:

ఈ సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యుడి సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

Also Read: Garlic For Cholesterol: ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే ఈ సమస్యలకు చెక్‌!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter

Read More