Home> లైఫ్ స్టైల్
Advertisement

White Hair: ఈ 5 మానుకుంటే నల్ల జుట్టు మీ సొంతం! నమ్మట్లేదా?

Premature White Hair Problem: చాలా మందిలో జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.  

White Hair: ఈ 5 మానుకుంటే నల్ల జుట్టు మీ సొంతం! నమ్మట్లేదా?

White Hair To Black Hair Naturally: ఆధునిక జీవన శైలి కారణంగా 25 ఏళ్ల యువకులు కూడా తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావడానికి టెన్షన్ ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చిన్న వయస్సులోనే ఇలాంటి సమస్యలో బాధపడేవారు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చిన్న వయసులో జుట్టు నెరసిపోవడానికి కారణాలు:
అనారోగ్యకరమైన ఆహారం అతిగా తీసుకోవడం.
 టెన్షన్ కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి.
విటమిన్ల, ఖనిజాల లోపం.
అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
రసాయనాలు అధికంగా ఉండే జుట్టు ఉత్పత్తుల వాడడం.
మద్యపానం,ధూమపానం
జన్యుపరంగా కూడా వస్తాయి.

జుట్టు నెరవకుండా ఉండాలంటే ఇలా చేయండి:
1. షాంపూలు తక్కువగా వినియోగించాల్సి ఉంటుంది:

 ప్రతిరోజూ షాంపూని ఉపయోగించడం వల్ల కూడా సులభంగా జుట్టు రంగు మారుతుందని నిపుణులు చెబుతున్నారు. రసాయన షాంపూలకు బదులుగా ఆర్గానిక్ షాంపూలను వినియోగించడం మంచిది. అంతేకాకుండా తక్కువ పరిమాణంలో షాంపూలు వినియోగించడం వల్ల ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.  

2. ప్రతి రోజూ తప్పకుండా హెల్తీ ఫుడ్స్ తినండి:
ప్రస్తుతం చాలా మంది ఆయిల్, జంక్ ఫుడ్స్ అతిగా తింటున్నారు. అయితే వీటిని అతిగా తినడం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా విటమిన్ B-12 కలిగిన పండ్లు తినడం వల్ల తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

3. కెమికల్ అధికంగా ఉండే హెయిర్ ఆయిల్ :
మార్కెట్‌లో ప్రస్తుతం కెమికల్స్ ఉన్న హెయిర్ ఆయిల్స్ ఎక్కువగా లభిస్తున్నాయి. జుట్టు సువాసన రావడానికి చాలా మంది వాటినే వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు సులభంగా వస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వాటికి బదులుగా బాదం, కొబ్బరి, ఆలివ్ నూనెలను వినియోగించడం చాలా మంచిది.

4. సిగరెట్, ఆల్కహాల్:
సిగరెట్, ఆల్కహాల్ మన ఊపిరితిత్తులు, కాలేయాన్ని పాడుచేయడమే కాకుండా, జుట్టుక సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు వీటిని మానుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

Also read: Apple iPhone 13, iPhone 14: యాపిల్ ఐఫోన్ కొనేవారికి హోలీ పండగ బంపర్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More