Home> లైఫ్ స్టైల్
Advertisement

Oily Skin remedies: జిడ్డు చర్మం స‌మ‌స్య ఉన్నవారికి ఉప‌యోగ‌ప‌డే నాచుర‌ల్ టిప్స్‌ ఇవే..!

Oily Skin In Summer Home Remedies: మనలో చాలా మందికి జిడ్డు చర్మం ఉంటుంది. దీని వల్ల మొటిమలు, జిడ్డు, నల్లమచ్చలు కలుగుతాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలి అనుకొనేవారు ఈ చిట్కాలను తయారు చేసుకొని పాటించడండి.
 

Oily Skin remedies: జిడ్డు చర్మం స‌మ‌స్య ఉన్నవారికి ఉప‌యోగ‌ప‌డే నాచుర‌ల్ టిప్స్‌ ఇవే..!

Oily Skin In Summer Home Remedies: మనలో చాలా మంది జిడ్డు చర్మ సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ జిడ్డు చర్మం వల్ల చర్మంపై మొటిమలు, వైట్‌, బ్లాక్‌ హెడ్స్‌ వంటి సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం మంచిది. దీని కోసం మీరు ఎలాంటి ఖరీదైన క్రీమలు, ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తారు. కానీ వీటి అన్నికంటే సహజంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల లాభాలు కలుగుతాయి. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. 

ఓట్‌మీల్‌: 

ముందుగా ఒక స్పూన్‌ ఓట్‌మీల్‌ను నీటిలో నానబెట్టి తరువాత వేరు చేసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో పెరుగు, తేనెను కలిపి పేస్ట్‌ను రెడీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తేనె చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. పెరుగులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. ఈ ఓట్ మీల్‌ ను చర్మానికి ఉపయోగించడం వల్ల అదనపు నూనెను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల వేసవిలో కలిగే మొటిమలు, జిడ్డు తొలగిపోతుంది. 

కలబంద: 

వేసవిలో కలిగే జిడ్డు, మొటిమలను తొలగించడంలో కలబంద ఎంతో మేలు చేస్తుంది. కలబంద ఆకు నుంచి జెల్‌ని తీసి బ్లెండ్‌ చేసుకోవాలి. కలబందలో విటమిన్ ఇ క్యాప్యూల్‌ను కలుపుకోవాలి. ఈ జెల్‌ను రోజు ఉపయోగించవచ్చు. దీని ఉపయోగించడం వల్ల చర్మ మంట సమస్య తగ్గుతుంది. చర్మానికి హైడ్రేట్‌గా ఉంచుతుంది. 

తేనె నిమ్మరసం: 

చర్మానికి తేనె, నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. దీని ముఖంకు అప్లై చేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది. దీని పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. నిమ్మకాయ మొటిమలను తొలగించడంలో ఎంతో మేలు చేస్తుంది. 

పెరుగు పసుపు:

పెరుగు చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. పసుపులో ఎన్నో ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని వల్ల మొటిమలు, జిడ్డు, నల్ల మచ్చలు రాకుండా ఉంటాయి. పెరుగు చర్మం మీద ఉండే డస్ట్‌ను తొలగిస్తుంది. 

వేసవిలో ఈ చిట్కాలను పాటించడం వల్ల చర్మం కాంతివంతంగా తయారు అవుతుంది.  దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.  వీటితో పాటు మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అధిక కొవ్వు ఉండే పదార్థాలు, నూనె వస్తువులు తీసుకోవడం వల్ల చర్మంపైన మొటిమలు కలుగుతాయి..

Also Read: AP Election Results: ఏపీ ఎన్నికల ఫలితాలపై ఈసీ సంచలన నిర్ణయం.. వైన్స్‌కు ఎగబడిన మందుబాబులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Read More