Home> లైఫ్ స్టైల్
Advertisement

Navratri 2020 Fasting Tips: నవరాత్రిలో ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి

భారతీయులకు దేవీ నవరాత్రుల ( Navratri ) సమయం అత్యంత పవిత్రమైన సమయం. దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా ఈ తొమ్మిది రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. 

Navratri 2020 Fasting Tips: నవరాత్రిలో ఉపవాసం చేస్తున్నారా? ఈ చిట్కాలు పాటించండి

భారతీయులకు దేవీ నవరాత్రుల ( Navratri ) సమయం అత్యంత పవిత్రమైన సమయం. దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా ఈ తొమ్మిది రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. నవరాత్రులు సంవత్సరానికి రెండు సార్లు వచ్చినా అక్టోబర్ మాసంలో వచ్చే శారదా ( Shardiya Navratri ) నవరాత్రులకు ప్రత్యేకత ఉంది. అమ్మవారి భక్తులకు ఈ తొమ్మిది రోజుల పాటు ఉపవాసాలు ఉంటారు. మీరు కూడా ఉపవాస దీక్ష చేస్తుంటే గనక ఈ విషయాలు తెలుసుకోండి. ఆరోగ్యాన్ని ( Health ) కాపాడుకోండి.

 

ALSO READ | Wall Colour for Wealth: గోడలకు ఈ రంగులు వేయడం వల్ల సంపద, ఆరోగ్యం కలుగుతుంది

  • మాంసాహారం తినవద్దు

నవరాత్రి ఉపవాస దీక్ష చేసేవారు మాంసాహారానికి దూరంగా ఉండాలి. దాంతో పాటు మైదా, కార్న్ ఫ్లోర్, ఉల్లిపాయలు, అల్లం ( Garlic ), రవ్వ, గోదుమ పిండి పదార్ధాలతో దూరంగా ఉండాలి.

  • సూర్యాస్తమం అయ్యాకే..

మీరు ఉపవాసం ఉంటే గనక సూర్యాస్తమానికి ముందు భోజనం చేయరాదు.

  • నీరు తాగండి

నవరాత్రి సమయంలో నీరు తాగరాదు అని చాలా మంది అనుకుంటారు. కానీ మంచి నీరు రోజంతా తాగవచ్చు. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గదు. దాంతో పాటు శరీరంలో ఉన్న విషతుల్యాలు బయటికి వెళ్తాయి. శరీరానికి శక్తి చేకూరుతుంది.

 

ALSO READ: Wallet for Wealth: పర్సులో ఏం ఉంచాలి ? ఏ రంగు వ్యాలెట్ వల్ల సంపద కలుగుతుంది..

  • ఫైబర్ ఉన్న ఆహార పదార్ధాలు

ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు, సలాడ్స్, డ్రై ఫ్రూట్స్, పెరుగును మీ డైట్ లో భాగం చేసుకోండి.

  • పల్లీలు

మీ శరీరంలో ప్రోటీన్ లెవల్స్ తగ్గుతున్నాయి అనిపిస్తే పల్లీలు తినవచ్చు. వాటిని వేయించి లేదా ఉడకబెట్టి లేదా అలాగే తినవచ్చు.

  • నిద్రా సమయం..

ఉపవాసాలు చేస్తున్న సమయంలో మంచి నిద్ర అవసరం. కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. 

 

 

ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

 

Read More