Home> లైఫ్ స్టైల్
Advertisement

Monsoon Hair Care: ఈ సీజన్లో మీ జుట్టు ఊడకుండా.. ఆరోగ్యకరమైన స్కాల్ప్‌‌కు ఈ 6 తినండి..

Monsoon Hair Care Tips:ఈ సీజన్లో పాలకూర అతిగా తినకున్న వారానికి ఒక్కసారైనా మీ డైట్ లో చేసుకోండి. పాలకూరలో ఐరన్ ఉంటుంది. ఫోలెట్ ,విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. వారికి హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది

Monsoon Hair Care: ఈ సీజన్లో మీ జుట్టు ఊడకుండా.. ఆరోగ్యకరమైన స్కాల్ప్‌‌కు ఈ 6 తినండి..

Monsoon Hair Care Tips: వర్షాకాలం వచ్చిందంటే వ్యాధుల కాలం అలాగే చర్మ జుట్టు సమస్యలు కూడా వస్తాయి. దీంతో అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. జుట్టు స్ప్లిట్ అండ్ సమస్యతో బాధపడతారు హెయిర్ ఫాల్ సమస్య కూడా మొదలవుతుంది. అయితే జుట్టుకి ఎన్ని అప్లై చేసినా మనం ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఆరు రకాల ఆహారాలు మన డైట్ లో వర్షాకాలంలో తప్పనిసరిగా ఉండాల్సిందే అవి ఏంటో తెలుసుకుందాం.

పాలకూర
ఈ సీజన్లో పాలకూర అతిగా తినకున్న వారానికి ఒక్కసారైనా మీ డైట్ లో చేసుకోండి. పాలకూరలో ఐరన్ ఉంటుంది. ఫోలెట్ ,విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటుంది. వారికి హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది పాలకూర డైట్ లో చేర్చుకుంటే ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. ఇది హెయిర్ ఫాలికల్స్ కి ఆక్సిజన్ కి రవాణా చేస్తుంది. దీనితో మీ చుట్టూ ఆరోగ్యంగా కనిపిస్తుంది అంతే కాదు ఆరోగ్యకరమైన సెబమ్‌ ఉత్పత్తి కూడా పాలకూర తొడ్పడుతుంది.

గుడ్లు
గుడ్లలో ప్రోటీన్ బయోటిన్ పుష్కలంగా ఉంటుంది ఈ రెండు జుట్టు పెరుగుదలకు ఎంత అవసరం ప్రోటీన్ లేని తో బాధపడుతున్న వారికి కూడా హెయిర్ ఫాల్ సమస్య మొదలవుతుంది. బయోటిన్ విటమిన్ బి ఉండే ఆహారాలు జుట్టుని ఆరోగ్యవంతం చేసి బలంగా మారుస్తాయి గుడ్లు మీ డైట్ లో చేసుకోవటం వల్ల మీ జుట్టుకు బయోటిన్ అందుతుంది.

ఇదీ చదవండి:  షాహి చికెన్ కుర్మా రెసిపీ.. ఇలా చేసుకుంటే ఎంతో టేస్టీ..

గింజలు, విత్తనాలు
గింజలు విత్తనాలు అంటే బాదం , ఫ్లాక్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇందులో ఇన్ల్ఫమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇది స్కాల్ప్ ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ జుట్టును బలంగా మారుస్తూ హెయిర్ ఫాల్ సమస్య రాకుండా నివారిస్తుంది. జుట్టును మృదువుగా మార్చి మెరిసేలా చేస్తుంది. రోజు గింజలు విత్తనాలు తీసుకో మీ డైట్ లో చేర్చుకోవాలి.

స్వీట్ పొటాటో..
స్వీట్ పొటాటోలో బీటాకెరోటిన్ పుష్కలంగా ఉంటుంది ఇది విటమిన్ ఏగా మారుస్తుంది. ఆరోగ్యకరమైన అభివృద్ధికి తోడ్పడతాయి విటమిన్ ఏ సెబమ్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది జుట్టును మాయిశ్చర్ గా ఉంచుతుంది. ఆ డ్రై స్కాల్ప్ తో బాధపడుతున్న వారు స్వీట్ పొటాటోను డైట్ లో చేర్చుకోవాలి.

బెర్రీస్..
స్ట్రాబెరీ బ్లూబెర్రీ రాజ్బెరి వంటి బెర్రీ జాతి పండ్లును డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. హెయిర్ ఫాలికల్స్ ని డామేజ్ కాకుండా ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా నివారిస్తుంది. విటమిన్ సీ కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది జుట్టును బలంగా మారుస్తుంది విటమిన్ సి బాడీ ఐరన్ గ్రహించేలా చేస్తుంది.

ఇదీ చదవండి: ఘుమఘుమలాడే పుదీనా చికెన్‌.. అబ్బొ చూస్తేనే నోరూరిపోతుంది..

తృణధాన్యాలు..
తృణధాన్యాలు ఫోలెట్‌, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య నివారిస్తుంది. అంతేకాదు ఫోలెట్ ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి తోడ్పడుతుంది . హెయిర్ ఫాలికల్స్ కి ఆక్సిజన్ సరఫరా చేస్తుంది దీంతో జుట్టు ఆరోగ్యంగా బలంగా మారుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Read More