Home> లైఫ్ స్టైల్
Advertisement

Milk Benefits for Skin: పచ్చి పాలు-అరటిపండు మిశ్రమంతో ముఖానికి ఇన్ని లాభాలా..?

Milk Benefits For Skin: ప్రతిరోజు ముఖానికి పాలన అప్లై చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కాలుష్యం కారణంగా వచ్చే మొటిమలు మచ్చలు సులభంగా దూరమవుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు 

Milk Benefits for Skin: పచ్చి పాలు-అరటిపండు మిశ్రమంతో ముఖానికి ఇన్ని లాభాలా..?

Milk Benefits for Skin: ప్రస్తుతం చాలామంది అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని రాత్రిపూట పాలు తాగుతున్నారు. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు రాత్రిపూట పాలను ఇవ్వడం వల్ల చాలా రకాల రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు రాత్రి పాలు తాగడం వల్ల శరీరంలో క్యాల్షియం లోపం తగ్గి, ఎముకలు దృఢంగా మారడమే కాకుండా.. శరీరానికి ప్రోటీన్స్ లభిస్తాయి.

పాల వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు కలుగుతాయో, చర్మాని కూడా అన్ని ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. పచ్చిపాలను ప్రతిరోజు పడుకునే ముందు ముఖానికి అప్లై చేసి పడుకుంటే ముఖంపై మచ్చలు, మొటిమలు దూరమవుతాయి. అంతేకాకుండా చర్మం బిగుతుగా కాంతివంతంగా తయారవుతుంది.

పచ్చిపాలను ఇలా ముఖానికి అప్లై చేయండి:
పచ్చిపాలను అప్లై చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో రెండు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిపాలను వేయాలి. ఆ తర్వాత చిన్న అరటిపండును తీసుకొని మిశ్రమంలో తయారు చేసుకొని.. అరటి పండు మిశ్రమాన్ని పచ్చి పాలలో ఐదు నిమిషాల పాటు మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మం అందంగా.. బిగుతుగా తయారవుతుంది.

Also Read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది

అంతేకాకుండా అరటి పండుకు బదులు టమాటో గుజ్జును కూడా పచ్చిపాలలో కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మానికి విటమిన్ సి లభించి.. రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.

ముఖానికి పచ్చి పాలను అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:

✵ ముఖానికి పచ్చి పాలను అప్లై చేయడం వల్ల చనిపోయిన కణాలు తొలగిపోయి. చర్మం అందంగా తయారవుతుంది. అంతేకాకుండా నల్ల మచ్చలు కూడా దూరం అవుతాయి.

✵ పొడి చర్మంతో బాధపడుతున్న వారు పచ్చిపాలను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం కారణంగా వచ్చే మొటిమలు తొలగిపోతాయి. 

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: IPL 2023 Winner: ఐపీఎల్ 2023 ఫైనల్ జీటీ వర్సెస్ సీఎస్కే చివరి ఓవర్‌లో ఏం జరిగింది, చెన్నై ఎలా గెలిచింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , FacebooKమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More