Home> లైఫ్ స్టైల్
Advertisement

Knee Pain Relief: పుట్నాలు, బెల్లంతో మోకాళ్ళ నొప్పులు నిజంగా తగ్గుతాయా?

Putnala Pappu Jaggery For Knee Pain: తరచుగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు పుట్నాలను పాలలో వేసుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మోకాళ్ళ నుంచి వచ్చే శబ్దాలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి చిట్కాను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా.

Knee Pain Relief: పుట్నాలు, బెల్లంతో మోకాళ్ళ నొప్పులు నిజంగా తగ్గుతాయా?

 

Putnala Pappu Jaggery For Knee Pain: చాలామందిలో చిన్న వయసులోనే మోకాళ్ళ సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా నడిచేటప్పుడు..కూర్చునేటప్పుడు మోకాల్లో వింత శబ్దాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం శరీరంలో క్యాల్షియం లోపించడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ఎముకలు బలహీనంగా మారి.. మోకాళ్ళ బొక్కలు అరిగిపోతున్నాయిం. దీంతో నడిచే క్రమంలో తీవ్ర నొప్పులకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్న ఈ చిట్కాలను తప్పకుండా పాటించాలి. వీటిని పాటించడం వల్ల వీలైనంత తొందర్లోనే ఉపశమనం లభిస్తుంది. 

మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు పాలలో బెల్లం, పుట్నాలు కలుపుకొని తాగాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరంలోని క్యాల్షియం లోపం తగ్గుతుంది. ఇలా ప్రతిరోజు రెండు పూటలు పాలను తాగడం వల్ల శరీరంలోని మలినాలు కూడా బయటికి వస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు తగ్గి.. మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పాలను పెద్ద వారే కాకుండా పిల్లలు తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. 

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

పుట్నాలు, బెల్లం కలిపిన గోరువెచ్చని పాలను ప్రతిరోజు తాగడం వల్ల ఎముకలు కూడా దృఢంగా మారుతాయి. ముఖ్యంగా మోకాలు నుంచి శబ్దాలు రావడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఈ పాలను ఉదయం ఖాళీ కడుపుతో, రాత్రి భోజనం తర్వాత తాగితే మోకాళ్ళ సమస్యలు అనేటివి ఉండవట. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా రక్తపోటు సమస్యలతో బాధపడే వారు కూడా ఈ పాలను తాగవచ్చు. 

ఈ చిట్కా కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది:
మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు పుట్నాలను నీటిలో నానబెట్టి పాలలో ఉడికించి చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేసుకొని తాగడం వల్ల ఈ నొప్పులకు ప్రభావంతంగా సహాయపడుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాలను కూడా తగ్గించేందుకు ప్రభావంతంగా దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Read More