Home> లైఫ్ స్టైల్
Advertisement

Flax seeds : రోజుకు ఒక చెంచా ఇది తీసుకుంటే చాలు.. ఎన్నో అనారోగ్యాలకు చెక్..

Linseeds benefits :అవిస గింజలు అదేనండి ఫ్లాక్ సీడ్స్‌.. చూడడానికి సిల్కీగా చేతిలో పట్టుకుంటే జారిపోయే విధంగా ఉండే ఈ విత్తనాలు మనకు అనేక రకాల వ్యాధుల నుంచి సంరక్షణ కలిగిస్తాయి అన్న విషయం చాలామందికి తెలియదు. అవిస గింజల్ని ఎలా తీసుకోవాలి అవి మనకు ఎటువంటి లాభాలను చేకూరుస్తాయో తెలుసుకుందాం పదండి..
 

Flax seeds : రోజుకు ఒక చెంచా ఇది తీసుకుంటే చాలు.. ఎన్నో అనారోగ్యాలకు చెక్..

Flax seeds: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు.. అస్తవ్యస్తమైన జీవన శైలి.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన ఇబ్బందిని కలిగిస్తూనే ఉంది. ఊబకాయం అనేది ప్రధాన సమస్యగా మారిన ఈ రోజుల్లో చాలామంది జిమ్ కి కూడా వెళ్లలేని బిజీ లైఫ్ గడుపుతున్నారు. అలాగే మరోపక్క బీపీ ,షుగర్ లాంటి సమస్యలు మన జీవితంలో భాగంగా మారిపోతున్నాయి. వీటన్నిటికీ కారణం మనం తీసుకునే ఆహారమే అది తెలిసినప్పటికీ మనలో చాలామంది ఆహారం విషయంలో పెద్దగా శ్రద్ధ కనబరచలేకపోతున్నారు.

కొలెస్ట్రాల్ ,రక్తపోటు ,మలబద్ధకం, మధుమేహం, ఊబకాయం లాంటి సమస్యతో బాధపడేవారు మన చుట్టుపక్కల ఎక్కువ మంది ఉన్నారు. చిన్న వయసు నుంచే నేటి యువత ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు.. వీటన్నిటికీ కారణం మన శరీరంలోని డైజెస్టివ్ సిస్టం సరిగ్గా పని చేయకపోవడమే. రోజు మనం టేస్టీ ఫుడ్ అనే నెపంతో పొట్టలోకి తోసే చెత్త డైజస్ట్ కాలేక, బయటకు వెళ్లలేక ,పేగుల్లోనే కుళ్ళిపోయి నానా రకాల సమస్యలకు దారి తీస్తోంది. అయితే ఇటువంటి సమస్యలకు ఇంటి వద్ద చిన్న చిట్కాలను ఫాలో సులభంగా పరిష్కరించుకోవచ్చు.

మన పొట్టను శుభ్రపరచడానికి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి ముఖ్యంగా తోడ్పడేది అవిసిగింజలు. అవిసె గింజలు లేదా ఫ్లాక్ సీడ్స్ మార్కెట్లో ఎంతో విరివిగా దొరుకుతాయి. వీటిలో పుష్కలంగా ఉండే ఫైబర్ ,ప్రోటీన్ ,ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. కడుపులో పేరుకుపోయిన చెత్తను తొలగించడంలో కూడా సహాయపడతాయి. ఆల్ఫా-లినోలెయిక్ యాసిడ్ యొక్క మూలం ఈ విత్తనాల్లో ఉన్న కారణంగా ఇది అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది.

పైగా వీటిలో  ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ గుండెకు మేలు చేయడమే కాకుండా ఎముకులకు మంచి పుష్టిని అందిస్తుంది. వీటిలో ఎక్కువ మోతాదులో లభించే ఆల్ఫా-లినోలిక్ యాసిడ్ కడుపులో మంట అల్సర్ వంటి వాటిని తగ్గించడంతోపాటు బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ ను చేరనివ్వదు. అలాగే ఇందులో అధిక మోతాదులో లభించే ఫైబర్ కారణంగా జీర్ణ వ్యవస్థ బలోపేతం అవ్వడంతో పాటు పేగులు శుభ్రపడి మలబద్ధకం లాంటి సమస్యలు తగ్గుతాయి.

 ఊబకాయంతో బాధపడేవారు అవిసె గింజలు రోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి కూడా అవిస గింజలు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుంది. అవిసె గింజలను బాగా రోస్ట్ చేసుకొని పొడి లాగా తయారుచేసి కూరల్లో, తాలింపుల్లో కలుపుకొని తీసుకోవచ్చు. లేదా నువ్వులు ఉండలు చేసుకున్నట్టు అవిస గింజలతో కూడా లడ్డు లాగా చేసుకుని తినవచ్చు. 

గమనిక:

పైన ఇచ్చిన సమాచారం నిపుణుల సూచనల మేరకు సేకరించినది. ఏదైనా ఫాలో అవ్వడానికి ముందు ఒకసారి మీ డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?

Also Read: TDP-Janasena: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ-జనసేన పోరాటం.. ఉమ్మడి తీర్మానాలు ఇవే..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Read More