Home> లైఫ్ స్టైల్
Advertisement

Chicken Masala: రుచికరమైన చికెన్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఎవరు చేసినా రుచి అదిరిపోతుంది..

Chicken Masala Recipe:  చికెన్ ప్రియులు కూడా ఎక్కువమంది ఉంటారు. చికెన్‌తో వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా చికెన్ కర్రీ గ్రేవీ ఫ్రై ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి.  ఈ రోజు దేశీ స్టైల్ లో చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Chicken Masala: రుచికరమైన చికెన్ మసాలాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఎవరు చేసినా రుచి అదిరిపోతుంది..

Chicken Masala Recipe: చికెన్‌తో వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా చికెన్ కర్రీ గ్రేవీ ఫ్రై ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అన్ని రెసిపీలు తయారు చేసుకున్న దీని రుచి అదిరిపోతుంది. చికెన్ ప్రియులు కూడా ఎక్కువమంది ఉంటారు అయితే ఈ రోజు దేశీ స్టైల్ లో చికెన్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

చికెన్ -1/2 కేజీ 
రెండు -ఉల్లిపాయలు
టమాటాలు-2,
 పచ్చిమిర్చి -మూడు 
అల్లం వెల్లుల్లి పేస్టు -రెండు టేబుల్ స్పూన్లు
 పెరుగు -అరకప్పు 
నూనె -రెండు టేబుల్ స్పూన్లు
 జిలకర- ఒక టేబుల్ స్పూన్లు
 దాల్చిన చెక్క -ఒకటి
 యాలకులు- మూడు 
లవంగాలు -మూడు,
 పసుపు -ఒక టేబుల్ స్పూన్
 ధనియాల పొడి- ఒక టేబుల్ స్పూన్
 జీలకర్ర పొడి- ఒక టేబుల్ స్పూన్
 కారంపొడి -ఒక టేబుల్ స్పూన్
 ఉప్పు -రుచికి సరిపడా

ఈ రెసిపీని ఎవ్వరు చేసిన బ్యాచిలర్స్‌ చేసుకున్న కొన్ని ఈజీగా వస్తుంది. దీనికి చికెన్ పీసులు చిన్నగా కట్ చేయించుకుని మిగతా కూరగాయలన్నీ బాగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి నూనె పోసుకొని వేడి చేసుకోవాలి మీడియం మంటపై జీలకర్ర, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కూడా వేసి మంచి అరోమా వచ్చేవరకు వేయించుకోవాలి.

ఇదీ చదవండి:    యమ్మీ దమ్ ఆలూ రిసిసీ.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..

ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి కూడా వేసి మరో మూడు నిమిషాల పాటు వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా ఉడికే వరకు వేయించాలి. కాసేపు అయ్యాక ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులో పసుపు పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారంపొడి, ఉప్పు కూడా వేసి బాగా కలిపి కాసేపు వేయించుకోవాలి.

ఇదీ చదవండి:  రాఖీ పౌర్ణమి ప్రత్యేక మెహందీ చిత్రాలు.. నిమిషంలో వేసుకునే రక్షాబంధన్‌ డిజైన్స్‌..

ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి.  6 నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాత చికెన్ ముక్కలు గ్రేవీ దగ్గర పడటం కనిపిస్తుంది. ఇందులో ఇప్పుడు మంట తగ్గించుకొని పెరుగు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ చిన్న మంటపై ఒక 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ముక్క మెత్తగా ఉడుకుతుంది ఇందులో ఇప్పుడు ఉప్పు రుచి సరి చూసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి ఈ రుచికరమైన చికెన్ కర్రీ చపాతి రోటి నాన్ లోకి అదిరిపోతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More