Home> లైఫ్ స్టైల్
Advertisement

How To Make Milk Hair Mask: ముట్టుకుంటేనే జుట్టు రాలిపోతోందా?.. ఈ హెయిర్ మాస్క్ తో అన్ని సమస్యలకు చెక్..

How To Make Milk Hair Mask: ఆధునిక జీవనశైలి, వాతావరణంలో కాలుష్యం పెరగడం కారణంగా చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రసాయనాలతో కూడిన ప్రోడక్ట్లను వినియోగించకుండా.. పాలతో చేసిన హెయిర్ మాస్కుని వినియోగించాలని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. 
 

 How To Make Milk Hair Mask: ముట్టుకుంటేనే జుట్టు రాలిపోతోందా?.. ఈ హెయిర్ మాస్క్ తో అన్ని సమస్యలకు చెక్..

How To Make Milk Hair Mask: జుట్టు అందంగా, మెరిసేలా ఉంటేనే ముఖం కూడా అందంగా కనిపిస్తుంది. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా, చెడు ఆహారవు అలవాట్ల వల్ల చాలా మంది జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఖరీదైన ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జుట్టులో తీవ్ర సమస్యలు వస్తున్నాయి. జుట్టు డ్యామేజ్ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మిల్క్ తో తయారు చేసిన హెయిర్ మాస్క్ ను వినియోగించాల్సి ఉంటుంది. పాలలో ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి జుట్టును లోపలి నుంచి సంరక్షించి రాలడాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా వెంట్రుకలను సిల్కీగా చేసేందుకు కూడా ఈ హెయిర్ మాస్క్ సహాయపడుతుంది. కాబట్టి దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మిల్క్ హెయిర్ మాస్క్ చేయడానికి కావలసిన పదార్థాలు :
పాలు 1 కప్పు 
తేనె 2 టేబుల్ స్పూన్లు 

మిల్క్ హెయిర్ మాస్క్ తయారీ విధానం:
>>మిల్క్ హెయిర్ మాస్క్ చేయడానికి, ముందుగా ఒక గిన్నె తీసుకోండి.
>>ఆ గిన్నెలో 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల తేనె జోడించండి.
>>ఈ రెండింటిని బాగా కలపండి. ఇక అంతే హెయిర్ మాస్క్ తయారైనట్టే..

మిల్క్ హెయిర్ మాస్క్ ఎలా ఉపయోగించాలి? 
>>మిల్క్ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టు మూలాలపై పూర్తిగా అప్లై చేయండి.
>>ఆ తర్వాత వేళ్ల సహాయంతో, తలపై తేలికపాటి మసాజ్ చేయండి.
>>సుమారు 5 నిమిషాలు జుట్టుకు వేడి టవల్ చుట్టి ఉంచండి.
>>ఆ తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ

Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More