Home> లైఫ్ స్టైల్
Advertisement

Oily Skin Remedies: జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఈ చిట్కాను ట్రై చేయండి !

Oily Skin Home Remedies: మనలో చాలా మంది జిడ్డు చర్మంతో బాధపడుతుంటారు. ఈ సమస్య వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. ఎంత కేర్‌ తీసుకున్న జిడ్డు వదిలిపోదు. ఈ సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇక్కడ చెప్పిన చిట్కాల ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Oily Skin Remedies: జిడ్డు చ‌ర్మం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఈ చిట్కాను ట్రై చేయండి !

Oily Skin Home Remedies: జిడ్డు చ‌ర్మం కార‌ణంగా మొటిమ‌లు, బ్లాక్ హెడ్స్ వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చ‌ర్మం జిడ్డుగా మార‌డానికి అనేక కార‌ణాలు ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉండే వ్య‌ర్థాలు, శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాలు ఇలా జిడ్డు రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తూ ఉంటాయి. చ‌ర్మం జిడ్డుగా మార‌కుండా ఉండాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..

టిప్స్‌..

 పెరుగు: జిడ్డు చర్మం ఉన్నవారు పెరుగు ప్యాక్‌ను ట్రై చేయండి. పెరుగుతతో ఫేస్‌ను శుభ్రం చేయడం వల్ల జిడ్డు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ డెడ్‌ సెల్స్‌ తొలగిస్తుంది. 

➤ కాఫీ: కాఫీ పౌడర్‌తో చర్మ సమస్యలకు ఎంతో మేలు చేస్తుంది. జిడ్డు సమస్యతో బాధపడుతున్నవారు కాఫీ పౌడర్‌ వాడటం వల్ల చర్మంలో ఉండే ఆయిల్‌లను పీల్చుకుంటుంది. 
​​
 అరటి గుజ్జు: అరటిపండు చర్మంలో ఉండే ఆయిల్‌ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. దీని వల్ల నల్ల మచ్చలు, జిడ్డు సమస్యలను రాకుండా చూస్తుంది. 

Also read: Stress Relief Foods: ఒత్తిడిని తగ్గించే ఆహారం ఇవే..! తప్పకుండా ట్రై చేయండి..

 బొప్పాయి: బొప్పాయిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిట్‌ సి,ఎ,బి లభిస్తాయి. ఇది జిడ్డు చర్మంతో బాధపడుతుంటే దీని గుజ్జును ఫేస్‌కు ఆప్‌లై చేయండి. జుడ్డు చర్మం మాయం అవుతుంది.

 టమాటా: జిడ్డు చర్మం ఉన్నవారు టొమాటో ముక్కపై కాస్త చెక్కర్‌ తో ఫేస్‌పై రుద్దాలి. ఇందులో  విటమిన్‌ సి, సిట్రిక్‌ యాసిడ్‌ అధికంగా ఉంటాయి. జిడ్డు నుంచి ఉపశమనం పొందవచ్చు. 

ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చ‌ర్మం జిడ్డుగా మార‌డం త‌గ్గుతుంది. చ‌ర్మ ఆరోగ్యంగా, అందం మారుతుంది.

Also read: Teeth Whitening: పసుపు పళ్ళతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాను ట్రై చేయండి !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More