Home> లైఫ్ స్టైల్
Advertisement

రంగేళి పండగ 'హోలీ' ప్రత్యేకత ఇదే

హోలీ రంగుల పండుగ. ఈ పండుగ ఏటా ఫాల్గుణ మాసంలో, పౌర్ణమి రోజున వస్తుంది.

రంగేళి పండగ 'హోలీ' ప్రత్యేకత ఇదే

హోలీ రంగుల పండుగ. ఈ పండుగ ఏటా ఫాల్గుణ మాసంలో, పౌర్ణమి రోజున వస్తుంది. ఈ పర్వదినాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు కూడా జరుపుకుంటారు. హోలీకి సంబంధించిన పురాణగాథ గురించి తెలుసుకుందాం.

రాక్షసరాజైన హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణు నామస్మరణతో వున్న ప్రహ్లాదునిపై కోపం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు. హోలికకు లభించిన వరం ప్రకారం, అగ్ని ఆమెకి ఏమీ చేయ‌దు. అన్న ఇచ్చిన ఆదేశంతో హోలిక ప్రహ్లాదుడిని ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళ్తుంది.

ఎప్పుడూ విష్ణు నామస్మరణలో ఉండే ప్రహ్లాదుడిని మంటలు తాకకుండా ఆ పరమాత్ముడు అనుగ్రహిస్తారు. వెంటనే ప్రహ్లాదుడు ఆ మంటల నుంచి బయటకు వచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. హోలికకు వరముంది కదా.. అగ్నికి ఆహుతైందేమిటీ అని మీకు అనుమానం రావచ్చు. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వరం సిద్ధిస్తుంది. బాలకుడైన ప్రహ్లాదుడిని కూడా తీసుకొని మంటల్లో ప్రవేశించడంతో ఆ వరం ఫలించలేదు.

హోలిక చనిపోయిన రోజును పురస్కరించుకొని 'హోలీ' పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు. మన్మథుడిని శివుడు భస్మం చేస్తాడు. అందుక‌నే హోలీ రోజున 'కామదహనం' నిర్వహించడం సంప్రదాయం.

Read More