Home> లైఫ్ స్టైల్
Advertisement

హోలీ పండగ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హోలీ పండగ అంటేనే రంగుల పండగ. అయితే, రంగులు చల్లుకోవడంలో వున్న మజాను ఆస్వాదించే క్రమంలో చాలామంది జాగ్రత్తలను గాలికొదిలేస్తారు.

హోలీ పండగ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హోలీ పండగ అంటేనే రంగుల పండగ. హోలీ నాడు స్నేహితులు, బంధుమిత్రులు ఒకరిపైమరొకరు రంగులు చల్లుకుంటూ ఎంతో సరదాగా గడిపేస్తారు. రంగులు చల్లుకోవడంలో వున్న మజాను ఆస్వాదించే క్రమంలో చాలామంది జాగ్రత్తలను గాలికొదిలేస్తారు. అయితే హోలీ జరుపుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే, కొన్నిసార్లు చర్మ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం వుండటంతోపాటు ఇంకొన్నిసార్లు కళ్లు. చెవులకు కూడా హానీ జరిగే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు వైద్య నిపుణులు. హోలీ పండగ సెలబ్రేట్ చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య నిపుణులు సూచిస్తున్న పలు సూచనలు, సలహాలు ఇలా వున్నాయి. 

> హోలీ ఆడటానికన్నా ముందే శరీరంపై సన్ స్ర్కీన్ లోషన్ రుద్దుకోవాలి. ఫలితంగా శరీరంపై పడిన రంగుని సదరు సన్ స్క్రీన్ లోషన్ శరీరం లోపలి వరకు వెళ్లనివ్వదు. 
> హోలీలో పాల్గొనడానికన్నా ముందుగా జుట్టు సంరక్షణ కోసం జుట్టుకు హెయిర్ ఆయిల్ పట్టిస్తే మంచింది. హోలీ ఆడే క్రమంలో ఒకవేళ జుట్టుపై రంగు పడినా, అది అట్టే జుట్టును పట్టేసుకుని వుండదు. ఆ తర్వాత తలస్నానం కూడా కొంత ఈజీ అవుతుంది.

fallbacks

> హోలీ ఆడిన తర్వాత మొదట మీ ముఖాన్ని సాదా నీటితో శుభ్రం చేసుకొని ఫేస్ క్రీమ్ పూసుకోవాలని సూచించారు. 
> కృత్రిమ రంగులతో చర్మ సమస్యలు రావచ్చు. కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రంగుల వల్ల చర్మం ఎర్రగా మారడంతోపాటు మంట, రాషెస్‌ కూడా రావచ్చు. 

fallbacks

> సమస్యకు పరిష్కారం వెతుక్కోవడంకన్నా నివారణ ఉత్తమం కనుక కృత్రిమ రంగుల బారి నుంచి చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం ముందుగానే శరీరాన్ని మొత్తం కప్పి ఉండేలా వస్త్రధారణ ధరిస్తే మంచిది. 
> హోలీ ఆడే సమయంలో ఒకవేళ శరీరంపై దురదగా అనిపిస్తే, వెంటనే వేడి నీళ్లతో రంగు పడిన చోటుని శుభ్రంగా కడిగేసుకోవాలి. 

fallbacks

> హోలీ ఆడే ముందు శరీరానికి నూనె దట్టిస్తే, రంగుల ప్రభావం తక్కువగా వుండి చర్మ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం సైతం తక్కువగా వుంటుంది. 
> హోలీ రోజు తెల్ల దుస్తులు ధరించడం చాలామందికి అలవాటు. అయితే ఆ తర్వాత వాటికి పట్టిన రంగుని వదిలించడం మాత్రం చాలా కష్టమైన పని. అందుకే రంగురంగుల దుస్తులని ఉపయోగించడం ద్వారా తిరిగి వాటికి పట్టిన రంగులని వదిలించుకునే శ్రమ కొంతవరకు తగ్గుతుంది. 

Read More