Home> లైఫ్ స్టైల్
Advertisement

Herbs For Hair Growth: ఈ నూనెలతో జుట్టు రాలడం తగ్గి హెయిర్‌ గ్రోత్‌ అవ్వడం ఖాయం..

Herbs For Hair Growth And Thickness: జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ కింది నూనెలను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ నూనెల్లో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు రాలడాన్ని కూడా సులభంగా తగ్గిస్తాయి. 

  Herbs For Hair Growth: ఈ నూనెలతో జుట్టు రాలడం తగ్గి హెయిర్‌ గ్రోత్‌ అవ్వడం ఖాయం..

Herbs For Hair Growth And Thickness: జుట్టు ఎల్లప్పుడు మెరవడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ వినియోగిస్తూ ఉంటారు. వీటిని వినియోగించడం వల్ల కొన్ని రోజుల పాటు మంచి ఫలితాలు పొందినప్పటికీ భవిష్యత్‌లో అనేక రకాల సమస్యలు రావచ్చని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను ప్రతి రోజు వినియోగించడం వల్ల జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి జుట్టు ఎల్లప్పుడు నల్లగా ఉండడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన నూనెను ప్రతి రోజు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు. 

లావెండర్ నూనె:
లావెండర్ నూనెలో యాంటీ-మైక్రోబయల్ ఎలిమెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నూనెను అప్లై చేసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా సులభంగా ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి. దీంతో పాటు శిరోజాలు కూడా దృఢంగా మారుతాయి. అంతేకాకుండా జుట్టు రక్తప్రసరణ మెరుపడి అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

కలబంద నూనె:
ఈ నూనె ఆయుర్వేద స్టోర్స్‌లో లభిస్తుంది. దీనిని వినియోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ ఎ, సి, ఇ విటమిన్స్‌ కూడా లభిస్తాయి. కాబట్టి తలకు పోషణను అందించేందుకు కూడా ప్రధాన ప్రాత పోషిస్తుంది. జుట్టు రాలడం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నూనెను వినియోగించడం వల్ల హెయిర్‌ ఫాల్‌ను కంట్రోల్‌ చేయోచ్చు. అంతేకాకుండా ఈ నూనెను సహజమైన కండీషనర్‌గా కూడా ఉపయోగించవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

జిన్సెంగ్ నూనె:
జిన్సెంగ్ నూనెలో ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. దీనిని ప్రతి రోజు వినియోగించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ నూనెను తలకు అప్లై చేయడం వల్ల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.  హార్మోన్ల కారణంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనెను అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 

రోజ్మేరీ నూనె:
రోజ్మేరీ నూనె కూడా జుట్టును ఆరోగ్యం చేసేందుకు కీలక పాత పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తప్రసరణను మెరుగుపరిచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు సులభంగా నల్లగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నూనెను వినియోగించండి. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More