Home> లైఫ్ స్టైల్
Advertisement

Watermelon Seeds Benefits: బాప్రే.. పుచ్చకాయ గింజలతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే షాక్ అవుతారు

Benefits of Watermelon Seeds: పుచ్చకాయ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. దాని గింజలు తినడం  కూడా అన్నే ఉపయోగాలు ఉన్నాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

Watermelon Seeds Benefits: బాప్రే.. పుచ్చకాయ గింజలతో ఇన్ని ప్రయోజనాలా..? తెలిస్తే షాక్ అవుతారు

Health Benefits Of Watermelon Seeds: వేసవి వచ్చేస్తోంది. ఎండాకాలంలో శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. బాడీలోని నీటి కొరతను తగ్గించేందుకు సమ్మర్ లో చాలా మంది పుచ్చకాయను తింటారు. ఇందులో 92% నీరు ఉంటుంది . వాటర్ మిలాన్ తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. పుచ్చకాయ గింజలను తీసుకోవడం వల్ల అంతకంటే ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయి. అంతేకాకుండా పుచ్చకాయ సీడ్స్ లో ఖనిజాలు, విటమిన్లు, జింక్, మంచి కొవ్వులు, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు పుష్కలంగా లభిస్తాయి. పుచ్చకాయ గింజలు తినడం వల్ల ఎన్నో వ్యాధులు దూరమవుతాయి. వీటిని పచ్చిగా లేదా వేయించి తింటారు. వాటర్ మిలాన్ సీడ్స్ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 

పుచ్చకాయ గింజల ప్రయోజనాలు:

**పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి నిగారింపునిస్తుంది. మెుటిమలు మరియు వృద్ధాప్య సమస్యలను దూరం చేస్తాయి. 

**పుచ్చకాయ గింజలు ప్రోటీన్లు, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు రాగితో నిండి ఉంటాయి. ఇది  జుట్టు రాలకుండా చేస్తుంది. అంతేకాకుండా డాండ్రఫ్ ను అరికడుతుంది. కుదుళ్లను బలంగా చేస్తుంది.

**వాటర్ మిలాన్ సీడ్స్ లో మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది బీపీని అరికట్టడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

**రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో పుచ్చకాయ గింజలు సూపర్ పనిచేస్తాయి. 

**వాటర్ మిలాన్ సీడ్స్ తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

**పురుషుల స్పెర్మ్ కౌంట్ పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 

**పుచ్చకాయ గింజల్లో లైకోపీన్ అనే ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్  రాకుండా అడ్డుకుంటుంది. 

**పుచ్చకాయ గింజలలో ఫోలేట్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, అమైనో ఆమ్లాలు మరియు విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీవక్రియను మెరుగుపరుస్తాయి.

Also Read: Curry Leaves: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే ఈ 5 వ్యాధులు మీ దరిచేరవు..

Also Read: Maruti Swift Price 2023: కేవలం రూ. 4 లక్షలకే మారుతీ స్విఫ్ట్‌ని ఇంటికితీసుకెళ్లండి.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More