Home> లైఫ్ స్టైల్
Advertisement

Weight Loss : బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. ఈ డ్రింక్స్ తాగితే వద్దన్నా తగ్గుతారు..!

Weight Loss Drinks : బరువు తగ్గడానికి చాలామంది తిండి మానేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం వల్ల కూడా మనం కొంతవరకు బరువు తగ్గగలం. ఉదయాన్నే కొన్ని మంచి కొన్ని డ్రింక్స్.. తాగడం వల్ల, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు వెయిట్ లాస్ కూడా సులువుగా అయిపోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.

Weight Loss : బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. ఈ డ్రింక్స్ తాగితే వద్దన్నా తగ్గుతారు..!

Weight Loss Drinks : ఈమధ్య కాలంలో ఆహార అలవాట్లు, లైఫ్ స్టైల్ కారణంగా, చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ముఖ్యంగా పొట్ట భాగంలో పేరుకుపోయి ఉన్న ఫాట్ కంటెంట్ తగ్గించడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. దానికోసం ఏవో రకాల డైట్లు అంటూ కొంతమంది తిండి కూడా మానేస్తారు. 

కానీ తినడం మానేయడం వల్ల ఆకలి పెరిగి ఏదైనా తినేయాలి అనిపిస్తుంది. లేదా ఎంత కంట్రోల్ చేసుకున్నా సరైన ఆహారం తినకపోతే నీరసపడిపోతాం. అలాకాకుండా హెల్తి ఫుడ్ తింటూ, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పానీయాలు తాగుతూ ఇంట్లోనే బరువు తగ్గొచ్చు. ఎలాగో వేసవికాలం కాబట్టి ఎప్పుడూ ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది. చక్కటి వేసవి పానీయాలతో ఇంట్లోనే మనం బరువు తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఆ వేసవి పానీయాలు ఏంటో తెలుసుకుందాం.

నిమ్మరసం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది. అందులో ఉండే ఫైబర్ కొవ్వుని కరిగిస్తుంది. అంతేకాకుండా నిమ్మరసం ఆకలిని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా అందులో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడతాయి. ఇలా నిమ్మరసానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చల్లటి నీటిలో నిమ్మరసాన్ని పిండుకొని, కొంచెం తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

బరువు తగ్గాలి అనుకునే వారు ఒక గ్లాస్ నీళ్లలో టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని నానబెట్టండి. ఉదయం లేచాక ఆ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా జీలకర్రలో ఉండే కీటోన్స్ కొవ్వుని కరిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీలకర్ర నీళ్లు తాగడం వల్ల మనం తీసుకునే ఆహారం కూడా చాలా త్వరగా జీర్ణం అవుతుంది. ఎసిడిటీ కూడా తగ్గుతుంది. 

దోసకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ దోసకాయలో ఉండే వాటర్ కంటెంట్ ఈ వేసవికాలంలో బాగా అవసరం. రోజూ దోసకాయని జ్యూస్ చేసుకొని తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. దోసకాయలో ఉండే పోషకాలు మన ముఖంలో కూడా కాంతిని తీసుకువస్తాయి. 

రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గడానికి కూడా కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే కొన్ని పోషకాలు కొవ్వుని కరిగించి బరువు తగ్గేలా చేస్తాయట.

బార్లీ వాటర్ వల్ల లెక్కలేనని ఉపయోగాలు ఉన్నాయి. జీర్ణ క్రియ బాగా జరుగుతుంది. బార్లీ నీళ్ల వల్ల బరువు చాలా త్వరగా తగ్గుతాం. శరీరం డిహైడెడ్ అవ్వకుండా చేయడంతో పాటు బార్లీ నీళ్లు బిపి, షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. ముఖ్యంగా గర్భంతో ఉన్న ఆడవాళ్లు బార్లీ నీళ్లు తాగడం వల్ల కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది.

Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..

Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More