Home> లైఫ్ స్టైల్
Advertisement

Intimate Health: ఈ అలవాట్లు శృతి మించితే లైంగిక జీవితంపై దుష్ప్రభావం తప్పదా

Intimate Health: మనం తినే కొన్ని పదార్ధాలు ఆరోగ్యానికి మేలు చేకూరిస్తే..ఇంకొన్ని హాని కల్గిస్తాయి. కాఫీ ఆరోగ్యానికి మంచిదే అయినా..పరిమితి మించితే మీ ప్రైవేట్ జీవితంపై ప్రభావం చూపిస్తుంది.
 

Intimate Health: ఈ అలవాట్లు శృతి మించితే లైంగిక జీవితంపై దుష్ప్రభావం తప్పదా

తినే తిండి-తాగే నీరు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. ఆరోగ్యానికి హాని కల్గించే పదార్ధాల్ని దూరం పెట్టాలి.

జీవనశైలి, ఆహారపు అలవాట్లు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంటాయి. కొన్ని రకాల పదార్ధాలు ఆరోగ్యానికి ప్రయోజనంగా ఉంటే..మరికొన్ని ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా కాఫీ నిద్రను పోగొట్టేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కాఫీ పరిధి దాటి తాగితే మాత్రం ప్రైవేట్ ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది. కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల యోనిలో సమస్యలు ఏర్పడతాయి. కాఫీలో ఉండే కెఫీన్ కారణంగా ఈ సమస్య తలెత్తతుంది. కెఫీన్ ఓవర్‌డోస్ అయితే..శరీరం, వెజీనాల పీహెచ్ లెవెల్స్ చెడిపోతాయి.

పసుపు నీరు సైడ్‌ఎఫెక్ట్స్

బరువు తగ్గించేందుకు పసుపు నీరు మంచి పరిష్కారం. పసుపు నీరు తాగడం వల్ల ముఖంపై నిగారింపుతో పాటు శరీరం ఇమ్యూనిటీ కూడా వేగంగా పెరుగుతుంది. అయితే పసుపు మోతాదు మించి తీసుకుంటే..శరీరానికి నష్టం చేకూరుతుంది. పసుపు నీటిని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది రీప్రొడక్టివ్ వ్యవస్థకు నష్టం కల్గిస్తుంది.

టీ సైడ్‌ఎఫెక్ట్స్

కొంతమంది అదే పనిగా టీ తాగుతుంటారు. టీ లేకుండా ఏ పనీ చేయలేరు. టీలో ఉండే కెఫీన్ ఆరోగ్యానికి మంచిదే కానీ..మోతాదు మించకూడదు. కెఫీన్ పరిధి దాటకూడదు. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్‌ఫర్మేషన్ ప్రకారం రోజూ ఎక్కువ టీ తాగే అలవాటుంటే..డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఫలితంగా వెజైనల్ డ్రైనెస్ రావచ్చు.

కూల్ డ్రింక్స్ దుష్పరిణామాలు

దాహం వేసినా, అలసటగా ఉన్నా అదేపనిగా కొంతమంది కూల్ డ్రింక్స్ సేవిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కూల్ డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది. ఇది ఇంటెస్టైన్‌లో ఇన్‌ఫెక్షన్ కల్గిస్తుంది. ఫలితంగా మీ లైంగిక కోరికల్లో ఇబ్బంది కలగవచ్చు.

Also read: Cholesterol Control Tips: మీకు కొలెస్ట్రాల్ ఉందా..అయితే ఈ 4 తప్పులు అస్సలు చేయవద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More