Home> లైఫ్ స్టైల్
Advertisement

Ageing Process: 40 ఏళ్లకే వయస్సు మీదపడుతుంటే..ఇలా చేయండి చాలు యౌవనం సదా మీ సొంతం

Ageing Process: వయస్సుతో పాటు వృద్ధాప్య ఛాయలు కన్పించడం సహజమే. అయితే ఇటీవలికాలంలో పిన్న వయస్సుకే ముసలితనం వచ్చేస్తోంది. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడమే.

Ageing Process: 40 ఏళ్లకే వయస్సు మీదపడుతుంటే..ఇలా చేయండి చాలు యౌవనం సదా మీ సొంతం

కొందరికైతే వయస్స మీదపడుతున్నా  యౌవనంతో కళకళలాడుతుంటారు. మరి కొందరు 30 ఏళ్లకే 50 ఏళ్లలా కన్పిస్తుంటారు. రోజువారీ జీవితంలో కొన్ని మార్పులు చేస్తే తప్పకుండా ఈ పరిస్థితిని నివారించవచ్చు.

ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల వయస్సు మీదపడకుండానే ముసలితనం మీద పడిపోతుంటుంది. అంటే 30-40 ఏళ్లకే 50 ఏళ్ల వయస్సులా కన్పిస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందని పరిశీలిస్తే..మనం రోజూ చేసే తప్పులే కన్పిస్తాయి. ఆ తప్పులు చేయకుండా మార్పులు చేసుకుంటే కచ్చితంగా ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడుకోవచ్చు. యౌవనంగా కన్పించవచ్చు.

బ్లూ స్క్రీన్‌కు దూరం

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎక్కువగా చూసేది లేదా రోజులో అత్యధికంగా గడిపేది సెల్‌ఫోన్‌తోనే. లేదా ఉద్యోగరీత్యా అధిక సమయం కంప్యూటర్ ముందు గడపడం. అంటే బ్లూ స్క్రీన్‌కు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంటారు. సాధ్యమైనంతవరకూ బ్లూ స్క్రీన్‌కు దూరంగా ఉండాలి. ఏజింగ్ అండ్ మెకానిజమ్స్ ఆఫ్ డిసీజ్ జర్నల్‌లో 2019లో ఈ అంశాలే ప్రచురితమయ్యాయి. బ్లూ స్క్రీన్ ఎక్కువసేపు చూస్తే..కళ్లలోని కణాలు దెబ్బతింటాయి. అందుకే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలంటున్నారు వైద్యులు.

రెండవ కారణం ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం. దీనివల్ల కూడా ముసలితనం త్వరగా కన్పిస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్ అనేది చర్మాన్ని పూర్తిగా డీహైడ్రేట్ చేసేస్తుంది. ముడతలు, ఎర్రగా మారడం, కళ్లు వాసినట్లుంటడటం ప్రధానమైన సమస్యలుగా కన్పిస్తాయి. కేన్సర్, హార్ట్ డిసీజ్ తగ్గించుకోవాలంటే మోతాదుకు మించి తాగకపోవడమే మంచిది. స్వీట్స్ కూడా తగ్గించేయాలి. ఎందుకంటే స్వీట్స్‌లో ఉండే కార్బోహైడ్రేట్లు వయస్సు మీదపడినట్టు చేస్తాయి.

ఇక మూడవది తరచూ ముఖానికి మాయిశ్చరైజర్ రాయడం. చాలామంది మాయిశ్చరైజర్ వాడరు. ఫలితంగా ముఖంపై ఏజియింగ్ లక్షణాలు త్వరగా కన్పించేస్తాయి. మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మంలో నీటిశాతం పెరిగి..చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే మాయిశ్చరైజర్ అలవాటు చేసుకుంటే మంచిది. 

ఇక చివరిగా సరైన నిద్ర లేకపోవడం కూడా ఏజీయింగ్‌కు ప్రధాన కారణం. క్లినికల్ అండ్ ఎక్స్‌‌‌పెరిమెంటల్ డెర్మటాలజీ ఆర్టికల్ ప్రకారం కావల్సినంత నిద్ర ఉండే మహిళల్లో 30 శాతం మందికి ముసలితనమే కన్పించదట. రోజుకు 7 గంటల నిద్ర మనిషికి తప్పనిసరి. దీనికితోడు రోజుకు కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి. 

Also read:  Brain Food: మీ మెదడు కంప్యూటర్‌లా పనిచేయాలంటే..ఈ ఫుడ్స్ డైట్‌లో చేరిస్తే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More