Home> లైఫ్ స్టైల్
Advertisement

Health Benefits Of Flowers: ఈ పూల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Health Benefits Of Flowers: చాలా మంది పువ్వులను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా మంచి సువాసన కోసం కూడా వినియోగాస్తారు. అయితే పూలను ఆహారంలో కూడా ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు..! ఆశ్చర్యపోకండి!

Health Benefits Of Flowers: ఈ పూల వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!

Health Benefits Of Flowers: చాలా మంది పువ్వులను అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అంతేకాకుండా మంచి సువాసన కోసం కూడా వినియోగాస్తారు. అయితే పూలను ఆహారంలో కూడా ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు..! ఆశ్చర్యపోకండి! అవును, వివిధ రకాల వంటకాల్లో పూలను ఆహారంగా ఉపయోగిస్తారు. కొన్ని పూలను ఔషదంగా కూడా వాడతారు. వైద్య శాస్త్ర అధ్యయనాలలో కొన్ని పువ్వుల ప్రయోజనాలు గురించి వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గులాబీ పువ్వు ప్రయోజనాలు (Benefits Of Rose):

గులాబీ పువ్వు మంచి సువాసనను కలిగి ఉంటుంది. అందుకే దీనిని అందరు ఇష్టపడతారు. గులాబీ రేకులను సలాడ్ రూపంలో కూడా ఉపయోగిస్తారు. పురాతన కాలం నుంచి.. గులాబీలను చైనీస్ వైద్యంలో జీర్ణక్రియ, రుతుక్రమ సమస్యల చికిత్స కోసం ఉపయోగించేవారని నిపుణులు తెలుపుతున్నారు. గులాబీలో క్యాలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉండడం వల్ల శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.

గుమ్మడి పువ్వు ప్రయోజనాలు(Pumpkin Flower Benefits):

ప్రతి ఒకరు గుమ్మడికాయ కూరను తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే దేశంలోని అనేక ప్రాంతాల్లో గుమ్మడికాయ పువ్వును కూడా ఆహారంలో వినియోగిస్తారని చాలా మందికి తెలియదు..! ఇందులో విటమిన్ B-9 అధిక మోతాదులో ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుందుకు దోహదపడుతుంది.

మందార పువ్వు ప్రయోజనాలు (Hibiscus Flower Benefits):

మందార పువ్వుకు ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిని హెర్బల్ టీ కోసం కూడా వినియోగిస్తారు. కొన్ని అధ్యయనాలు మందార పువ్వు పొట్ట సమస్యలను నయం చేయడానికి,  కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Mango Peels Benefits: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇలా మామిడి తొక్కతో ఉపశమనం పొందండి..!

Also Read:  Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More