Home> లైఫ్ స్టైల్
Advertisement

Skin Problems: చలికాలం వచ్చిందంటే ఈ చర్మ సమస్యలు తప్పడం లేదా, ఈ రెమిడీస్ ట్రై చేయండి

Skin Problems: చలికాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే శీతాకాలం పలు వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. కారణం శీతాకాలంలో ఇమ్యూనిటీ పడిపోవడమే. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందు ఇమ్యూనిటీ పెంచుకోవల్సి ఉంటుంది. 

Skin Problems: చలికాలం వచ్చిందంటే ఈ చర్మ సమస్యలు తప్పడం లేదా, ఈ రెమిడీస్ ట్రై చేయండి

Skin Problems: చలికాలంలో అన్నింటికంటే ప్రధాన సమస్య చర్మ సంబంధిత సమస్యలు ఎదురౌతాయి. చలి గాలుల కారణంగా చర్మం ఎండిపోయి, నిర్జీవంగా మారిపోతుంది. ఫలితంగా దురద, మంట వంటివి ఏర్పడతాయి. నవంబర్ పూర్తయి డిసెంబర్ నెల సమీపిస్తోంది. ఈ క్రమంలో చలిగాలుల తీవ్రత పెరిగిపోతోంది. ముఖ్యంగా ఉత్తరాదిలో చలి ప్రభావం ఎక్కువగా కన్పిస్తోంది. చలికాలంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో చర్మ సమస్య ఒకటి. చల్లని గాలుల కారణంగా చర్మం నిర్జీవమై ఎండిపోయినట్టు కన్పిస్తుంది. అంటే చర్మం డ్రైగా మారిపోతుంది. ఫలితంగా దురద, మంట, బొబ్బలు ఏర్పడవచ్చు. చలికాలంలో డ్రై స్కిన్ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 

బాదం ఆయిల్ చర్మానికి చాలా మంచిది. బెస్ట్ నేచురల్ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది. బాదం ఆయిల్ నేరుగా రాయవచ్చు లేదా ఏదైనా మాయిశ్చరైజర్‌లో కలిపి రాసుకోవచ్చు. రోజూ రాస్తే మంచి ఫలితాలుంటాయి. 

చర్మాన్ని డ్రై కాకుండా ఉండేందుకు మరో మంచి ప్రత్యామ్నాయం అల్లోవెరా జెల్. ఇది కూడా నేచురల్ మాయిశ్చరైజర్. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతూ మృదువుగా మారుస్తుంది. అల్లోవెరా జెల్‌ను నేరుగా చర్మానికి రాసుకోవచ్చు.

తేనెతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. దాంతో పాటు అద్భుతమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా, నిగనిగలాడేలా చేస్తుంది. తేనెను కూడా నేరుగా చర్మానికి రాసుకోవచ్చు లేదా మాయిశ్చరైజర్‌తో కలిపి రాయవచ్చు. అన్నింటికంటే బెస్ట్ నేచురల్ మాయిశ్చరైజర్ కొబ్బరినూనె. అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. చర్మం డ్రై కాకుండా ఉంటుంది. కొబ్బరి నూనెను రోజూ నిద్రపోయే ముందు రాసుకుంటే మంచి ఫలితాలుంటాయి. లేదా కొంతమంది స్నానానికి అరంగట ముందు రాసుకుంటారు. 

Also read: Lemongrass Tea: లెమన్ గ్రాస్ టీ ప్రయోజనాలు తెలిస్తే ఎప్పుడూ వదిలిపెట్టరు, కేన్సర్ సైతం నియంత్రణలో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More