Home> లైఫ్ స్టైల్
Advertisement

Real love story: యాసిడ్ దాడి, 5 ఏళ్లు కోమాలో..ప్రేమించి పెళ్లి చేసుకున్న రాణి, సరోజ్‌ల యదార్ధ ప్రేమ కధ ఇది

Real love story: ప్రేమకు కులం లేదు..మతం లేదు. ఎల్లలు లేవు. ఆస్థి లేదు..అంతస్థు ఉండదు. రూపం అంతకంటే కాదు. ప్రేమ అన్ని హద్దుల్ని దాటేస్తుంటుంది. ఇదేమీ ఫిలాసఫీ కాదు. నిజం..ముమ్మాటికీ నిజం. నమ్మలేకపోతే..రాణి వర్సెస్ సరోజ్ ప్రేమ కధ వింటే అర్ధమౌతుంది. 

Real love story: యాసిడ్ దాడి, 5 ఏళ్లు కోమాలో..ప్రేమించి పెళ్లి చేసుకున్న రాణి, సరోజ్‌ల యదార్ధ ప్రేమ కధ ఇది

ఇది ముమ్మాటికీ నిజమైన ఓ ప్రేమ కధ. స్వచ్ఛమైన మనస్సుతో ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికుల కధ. యాసిడ్ ఎటాక్‌తో అంద వికారమైన ఓ యువతిని ప్రేమించి పెళ్లాడిన ప్రేమికుడి కధ. నిజంగా జరిగిన యదార్ఘ కథ.

30 ఏళ్ల రాణి ఒడిస్సా కటక్‌‌కు చెందింది. ఆమెపై 2009లో యాసిడ్ దాడి జరిగింది. దాంతో ఆమె చాలా దారుణంగా కాలిపోయింది. ఏకంగా 5 ఏళ్లపాటు 2009 నుంచి 2014 వరకూ కోమాలోనే ఉంది. అదే సమయంలో సరోజ్‌కు రాణితో పరిచయమైంది. 2021లో అంటే రెండేళ్ల క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మెడికల్ రంగంలో పనిచేస్తున్న సరోజ్..రాణిని చికిత్స సందర్భంగా తొలిసారి కలిశాడు. అప్పట్నించి తరచూ కలిసేవాడు. 

రాణి గురించి సరోజ్ మాటల్లో...

ఆమె మాటల్లో ఆమె పద్థతి నన్ను ఆకర్షించింది. ఆమెపై ప్రేమ చిగురించింది. ఆమె నిజంగా ఓ పోరాట యోధురాలు. యాసిడ్ ఎటాక్ జరిగినా..ముఖం అంద వికారమైనా...జీవించేందుకు పోరాడింది. పోరాడి గెలిచింది. ముఖం అందాన్ని కోల్పోయినా..మనస్సు చాలా అందమైంది. 

రాణి మాటల్లో...

నాపై యాసిడ్ దాడి చేసింది ఎవరో కాదు. ఇండియన్ ఆర్మీలో జవాను. నా ఇంటికి దగ్గరలో క్యాంప్‌కు వచ్చాడు. అప్పుడే నన్ను చూసి పెళ్లి చేసుకుంటానన్నాడు. నేను కాదనడంతో నాపై యాసిడ్ విసిరాడు. ఆ తరువాత కచ్చితంగా ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. కోమా నుంచి బయటకు వచ్చాక చూస్తే నా తలపై ఒక్క వెంట్రుక కూడా లేదు. నా కళ్లు లేవు. నా పెదాలు, ముక్కు అంతా చాలా దారుణంగా కాలిపోయున్నాయి. నేను ఓడిపోయాను

అదే సమయంలో సరోజ్ నన్ను కలిశాడు. నేరస్థుడిని పట్టుకోవడంలో కోర్టులో విచారణ సందర్భంగా సరోజ్ చాలా సహాయం చేశాడు. ఆ తరువాత ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకున్నాం. ప్రేమంటే అర్ధం మనస్సులు కలవడమేనని రాణి చెబుతుంటే..నిజంగా ఇదే అసలైన ప్రేమ కధ అన్పిస్తుంది. 

Also read: Skin Care Tips: ఈ అలవాట్లు మానుకోకపోతే..40 ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More