Home> లైఫ్ స్టైల్
Advertisement

Ginger Water Uses: అల్లం వాటర్​ తో ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్! దీని వల్ల కలిగే లాభాలు బోలెడు

Ginger Water Benefits: అల్లంలో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌, మిలనర్స్‌ వంటి గుణాలు అధికంగా ఉంటాయి. దీని ఎలాంటి అనారోగ్య సమస్యలు మన వద్దకు రాకుండా ఉంటాయి. అయితే దీనిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం వల్ల కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం.

Ginger Water Uses: అల్లం వాటర్​ తో ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్!  దీని వల్ల కలిగే లాభాలు బోలెడు

Ginger Water Benefits: అల్లంను మనం మనం ప్రతిరోజు  వంటల్లో రుచి పెంచుకోవడం కోసం ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఈ అల్లం కేవలం వంటలకు మాత్రమే కాకుండా ఇది ఆరోగ్య సమస్యలకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఉదయాన్నే అల్లంతో తయారు చేసిన నీళ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే అల్లం నీరు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి. దీని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ అల్లాన్ని ఎక్కువగా మనం కూరల్లో వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటాము. అల్లాని పొద్దున్నే టీ లేదా నీరుగా తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

 అల్లం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు: 

పరగడుపున ఉదయాన్నే ఒక కప్పు గోరవెచ్చని అల్లం వాటర్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, మోషన్స్, గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే మసాలాల గుణాలు  అనారోగ సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది.  అల్లం నీరు తీసుకోవడం వల్ల కీళ్లనొప్పి, కండరాల నొప్పి, వాపులు వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ అల్లం కేవలం కీళ్ల నొప్పులకే మాత్రం కాకుండా గుండెకు సంబంధిత సమస్యల నుంచి కూడా  రక్షిస్తుంది. ఇది శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తొలగించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది.

అల్లం వాటర్‌ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఆహారాన్ని జీర్ణ చేస్తాయి. అలాగే  అల్లం వికారం, వాంతులకు సహజ చికిత్సగా సుదీర్ఘంగా ఉపయోగించబడుతోంది. ప్రయాణ అనారోగ్యం, గర్భధారణ వాంతులు, కీమోథెరపీ వల్ల వచ్చే వికారం చికిత్సకు ఇది ప్రభావవంతంగా ఉంటుంది. అల్లం శక్తివంతమైన నొప్పి నివారణ గుణాలు ఉంటాయి. ఇది మైగ్రేన్ నొప్పులతో సహా వివిధ రకాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి విషాలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది చర్మపై కలిగే  మొటిమలు చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అల్లం రక్తంలో షుగర్‌  స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం యాంటీ-క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంది ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను నెమ్మదిస్తుంది. క్యాన్సర్ చికిత్సల దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Also Read: PM Modi To Host Dinner Party: ఢిల్లీ పోలీసులకు ప్రధాని మోదీ డిన్నర్ పార్టీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Read More