Home> లైఫ్ స్టైల్
Advertisement

Hemoglobin Foods: రక్త హీనత సమస్య నుంచి బయట పడండి ఇలా !

Blood Increasing Foods: సాధారనంగా ఆరోగ్యకరమైన మనిషిలో 5 లీటర్ల రక్తం ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రక్తం తక్కువగా ఉంటే అనారోగ్యసమస్యల బారిన పడాల్సి ఉంటుంది.

Hemoglobin Foods: రక్త హీనత సమస్య నుంచి బయట పడండి ఇలా !

Blood Increasing Foods: శరీరంలో రక్తం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అలసట, నీరసం, బలహీనత వంటి సమస్య బారిన పడాల్సి ఉంటుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఐరన్‌ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య బారిన పడకుండా ఉంటాం.  

అవిసె గింజల్లో కూడా ఐరన్‌ పుష్కలంగా లభిస్తుంది. వీటిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా రాగి జావ కూడా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. 

క్యాలీ ఫ్లవర్‌ కాడల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని పడేయకుండా తినడం చేయాలి. ఇలా క్యాలీ ఫ్లవర్ కాడలను పడేకుండా ఆహారంలో తీసుకుంటే ఐరన్ లభిస్తుంది.

అలాగే తోట కూరలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి తోట కూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. 

రీరంలో రక్తం పెరుగుదలకు బీట్ రూట్ దోహదపడుతుంది. ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నుంచి మలినాలను తొలగించడంతో ఎంతో మేలు చేస్తుంది.

యాపిల్  రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడంలో ఎంతో సహాయపడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్స్ అధికంగా లభిస్తాయి.  రక్తం వృద్ధి చెందడంలో ఎంతో మేలు చేస్తుంది.

ఖర్జూరాలు, బాదం, వాల్‌ట్స్ వంటి ఎండు ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటి తీసుకోవడం వలన రక్త కణాల సంఖ్య  పెరుగుతుంది. 

Also read: Amla Benefits: ఉసిరికాయతో కలిగే లాభాలు ఇవే!

శరీరంలో రక్తం తక్కువగా ఉంటే  పాలకూరను తప్పకుండా తీసుకోవాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. 

నువ్వుల్లో ఐరన్, ఫోలేట్, కాపర్‌ ఇతర పోషకాలు వంటి  పోషకాలు ఉన్నాయి. ఇవి రక్తహీనతను అధిగమించడంలో సహాయపడుతాయి.

మిల్లెట్స్‌ రోజూ తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  లెవెల్స్‌ మెరుగుపడుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్ పుష్కలంగా లభిస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి చాలా సహాయపడుతాయి.

Also read: Knee Pain Relief: కీళ్ల నొప్పితో బాధపడున్నారా? ఈ చిట్కాలను ప్రయత్నించండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More