Home> లైఫ్ స్టైల్
Advertisement

Facial Beauty Tips: ముఖం మచ్చలు, ముడతల్లేకుండా కళకళలాడాలంటే ఈ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి

Facial Beauty Tips: ఆరోగ్యంపై ఎంతటి శ్రద్ధ తీసుకుంటామో చర్మం గురించి కూడా అంతే సంరక్షణ అవసరం. పోటీ ప్రపంచంలో కాలుష్యపు వాతావరణంలో వివిధ రకాల ఇతర కారణాలతో చర్మమే ఎక్కువగా దెబ్బతింటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలి. 

Facial Beauty Tips: ముఖం  మచ్చలు, ముడతల్లేకుండా కళకళలాడాలంటే ఈ ఫేస్‌ప్యాక్ ట్రై చేయండి

Facial Beauty Tips: ఆరోగ్యం మనిషికి ఎంత అవసరమో ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణ కూడా అంతే అవసరం. చర్మాన్ని పరిరక్షించేందుకు ప్రకృతిలోనే ఎన్నో పద్ధతులున్నాయి. ఏది అనువైందో తెలుసుకుని అలవర్చుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం..

ఇటీవలి కాలంలో చర్మం నిగారింపు కోల్పోవడం, నిర్జీవంగా ఉండటం, ముఖంపై ముడతలు, పింపుల్స్, నల్లటి మచ్చలు, ట్యానింగ్ సమస్య ఇలా వివిధ కారణాలతో చర్మం అందం కోల్పోతుంది. ముడతలు ఏర్పడి యుక్త వయస్సుకే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తున్నాయి. వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు, నీళ్లు తగినంత తాగకపోవడం, నిద్రలేమి ఇలా చాలా కారణాలు కారకాలుగా ఉంటున్నాయి. చర్మం కళ కోల్పోతుంటుంది. ముఖ సౌందర్యం, చర్మ సంరక్షణ కోసం మార్కెట్‌లో చాలా రకాల బ్యూటీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా..అందులోని రసాయనాల కారణంగా దుష్పరిణామలే ఎక్కువగా ఉంటాయి. అందుకే చర్మ పరిరక్షణకు సాధ్యమైనంతవరకూ ప్రకృతిలో లభించే పదార్ధాలతో చిట్కా పద్ధతులు అవలంభించాలి. అందులో ముఖ్యమైనది బంగాళ దుంపలతో ఫేస్‌ప్యాక్. బంగాళదుంపల ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మచ్చలన్నీ తొలగిపోవడమే కాకుండా..నిగారింపు వస్తుంది. 

బంగాళదుంపతో చర్మానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. చర్మ నిగారింపులో బంగాళదుంప ఫేస్ ప్యాక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖానికి దుంపను సరైన విధానంగా అప్లై చేస్తే ముఖంపై ఉండే నల్లని మచ్చలు, మరకలు తొలగిపోతాయి. బంగాళదుంపల్లో ఉండే యాంటీ ఏజీయింగ్ గుణాల కారణంగా ముఖంపై ముడతలు కూడా పోతాయి. కంటి కింద నల్లటి వలయాలు తొలగుతాయి. బంగాళదుంప ఫేస్ ప్యాక్ ఒక్కటే ఈ అన్నింటికీ సరైన పరిష్కారం. ఈ ఫేస్ ప్యాక్‌తో దుష్పరిణామాలు ఏవీ ఉండవు.

తేనె, బంగాళదుంప కాంబినేషన్ ముఖంపై మచ్చలు పోగొట్టి, నిగారింపు తెచ్చేందుకు అద్భుతమైన పద్ధతి. ఓ గిన్నెలో 1 స్పూన్ బంగాళదుంప రసం, 1 స్పూన్ తేనె, 2 స్పూన్స్, పచ్చిపాలు వేసి కలుపుకోవాలి. ఇందులో కొన్ని డ్రాప్స్ గ్లిసరిన్ కూడా వేస్తే మంచిది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో 3 సార్లు చేస్తే మంచి ఫలితాలుంటాయి. ముఖంపై ఏ విధమైన మచ్చలుండవు సరికదా నిగారింపు వచ్చి చేరుతుంది. 

ముల్తానీ మిట్టీ, బంగాళదుంప కాంబినేషన్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఓ గిన్నెలో 2 స్పూన్ల ముల్తానీ మిట్టీ, బంగాళదుంప రసం తీసుకోవాలి. ఈ రెండింటినీ కలిపి ముఖానికి రాసుకుని 15-20 నిమిషాలుంచాలి. ఈ ఫేస్ ప్యాక్ తో ముఖంపై ఉండే అదనపు ఆయిల్ తొలగడమే కాకుండా ముడతలు తగ్గుతాయి.

టొమాటో రసం, బంగాళదుంప కూడా మరో మంచి కాంబినేషన్. దీనికోసం ఓ గిన్నెలో 1 స్పూన్ టొమాటో రసం, 2 సూన్స్ తేనె, 1 స్పూన్ బంగాళదుంప రసం తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఓ 15 నిమిషాలుంచాలి. ఈ ప్రక్రియతో ముఖంపై ఉండే పోర్సిస్ క్లియర్ అవుతాయి. ఫలితంగా యాక్నే సమస్య ఉత్పన్నం కాదు. 

Also read: Benefits of Cabbage: ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే క్యాబేజీని డైట్ లో చేర్చుకోండి...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More