Home> లైఫ్ స్టైల్
Advertisement

Dussehra 2022: మీ మిత్రులకు ఇలా విజయదశమి శుభాకాంక్షలు తెలుపండి..

Dussehra 2022: చెడుపై మంచి సాధించిన గుర్తింపుకు గాను విజయదశమి జరుపుకుంటారు. దసరా సందర్భంగా జీవితంలో జరుగుతున్న కష్టాలను తొలగించాలని ఆ దుర్గామాతను కోరుకుంటారు. అయితే మీ మిత్రుని జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ ఈ శుభాకాంక్షలు వారికి తెలియజేయండి.

Dussehra 2022: మీ మిత్రులకు ఇలా విజయదశమి శుభాకాంక్షలు తెలుపండి..

Dussehra 2022:  భారత్‌లో ప్రతి సంవత్సరం విజయదశమిని ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా దసరాను పురస్కరించుకొని చాలామంది అమ్మవారి పూజ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ దసరాను చెడుపై మంచి సాధించిన దుర్గాదేవి విజయానికి గుర్తింపుగా జరుపుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం దసరా అక్టోబర్ మాసంలోనే వస్తుంది. కానీ ఈ సంవత్సరం నవరాత్రులు కొంచెం ముందుగానే మొదలయ్యాయి. నవరాత్రుల్లో ప్రతిరోజు మంచి రోజే కాబట్టి శుభ కార్యక్రమాలు చేసుకునేందుకు మంచి సమయంగా చెప్పొచ్చు. 

అన్ని పండగలకు ప్రత్యేకలు ఉన్నట్టు దసరా పండుగ కూడా ఓ ప్రత్యేకత ఉంది. అసత్యం, అధర్మం, పాపాలు చేసిన రావణున్ని సంహరించడం వల్లే దసరా పండుగను ప్రజలంతా ఘనంగా జరుపుకునే వారిని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శ్రీరాముడు మహావిష్ణువు అవతారంలో జన్మించి.. రావణ సంహారం చేశారని కూడా భారతీయులు నమ్ముతారు. అందుకే భారతదేశ వ్యాప్తంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసి దసరాను జరుపుకుంటారు. అంతేకాకుండా ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటారు. అయితే ఈ సంవత్సరం మీ మిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

దసరా శుభాకాంక్షలు మీ మిత్రులకు ఇలా చెప్పండి:

>>చెడుపై సాధించిన మంచి గాను మీ జీవితంలో ప్రతి దశలో విజయం సాధించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు.
>>రావణుడి దిష్టిబొమ్మతోపాటు మీలోని అహం ద్వేషం కోపాన్ని మంటలు కాల్చేయండి.. అన్నింటిలోనూ విజయం సాధించండి.
>>ఆ దుర్గామాత ఆశీస్సులతో మీ కోరికలన్నీ తీరి.. కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు.
>>మీ కష్టాలన్నీ దసరా పండుగ కానుకలుగా తీరిపోవాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
>>ధర్మ మార్గం అనుసరించి ప్రతి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
>>దసరా సందర్భంగా మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని నింపాలని ఆ దుర్గామాతను ప్రార్థిస్తూ విజయదశమి శుభాకాంక్షలు.

Also Read: Bathukamma 2022 Wishes: తెలంగాణ ప్రజలందరికీ పూల పండగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

Also Read: Bathukamma 2022: బతుకమ్మ పండుగను పూర్వికులు ఇలా జరుపుకునే వారట.. మరి మీరు ఎలా జరుపుకుంటున్నారు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Read More